mandakrishna

రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారు -మందకృష్ణ

SC వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని MRPS అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేడు (బుధవారం) 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అదించనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ తర్వాతే నియామకాలు చేపడతామని మాటిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాటతప్పారంటూ మందకృష్ణ ధ్వజమెత్తారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తూ ఆర్డినెన్స్ తెస్తామని ఆయన అసెంబ్లీలో చెప్పారని, కానీ ఇప్పుడు ఎలాంటి వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురాకుండానే 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు ఎలా అందజేస్తారని ప్రశ్నించారు.

దీనివల్ల తమ మాదిగ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, మొత్తం 11 వేల పోస్టుల్లో ఎస్సీలకు1,650 పోస్టులు రావాల్సి ఉండగా, వాటిలో 1,100 పోస్టులు మాదిగ, మాదిగ ఉప కులాలకు రావాల్సి ఉందని, కానీ వర్గీకరణ చేపట్టకపోవడంతో కనీసం తమకు 600 పోస్టులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం తమకు వర్గీకరణ జరగాలని, దానికి అనుగుణంగా ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. DSC నియామకాలను నిరసిస్తూ MRPS రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

Related Posts
బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court notices to the Central and AP government

న్యూఢిల్లీ: బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని న్యాయస్థానం అభిప్రాయ‌ప‌డింది. దేశంలో Read more

పసివాడి ప్రాణాన్ని తీసిన పల్లి గింజ
పసివాడి ప్రాణాన్ని తీసిన పల్లి గింజ

పల్లి గింజ ఏడాదిన్నర పసివాడి ప్రాణం తీసింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి కథనం Read more

రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేశ్
lokesh300cr

రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ రేపు ఉదయం సా.4.30 గంటలకు ఢిల్లీకి ప్రయాణం ప్రారంభిస్తారని అధికారికంగా తెలియజేశారు. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి, Read more

మరోసారి జ్యోతిష్యుడు వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు..
Womens commission notices to astrologer Venu Swamy once again

హైదరాబాద్‌: జ్యోతిష్యుడు వేణు స్వామికి మరోసారి షాక్ తగిలింది. మహిళా కమిషన్ రెండో సారి నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీస్ Read more