టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో ఆయన బిజీగా ఉన్నాడు. తాజాగా, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమా విశేషాలను పంచుకున్నాడు.ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ,కన్నప్ప కథను మరోసారి ప్రపంచానికి చెప్పే అవకాశాన్ని ఆ శివుడు నాకే ఇచ్చాడని నేను భావిస్తున్నాను. లేకపోతే ఇంతమంది స్టార్స్‌తో కలిసి నేను ఈ సినిమా చేయడం ఎలా సాధ్యం అవుతుంది అని అలాగే, భక్త కన్నప్ప సినిమాలో రావు గోపాలరావు గారు పోషించిన కీలక పాత్రను ఈ సినిమాలో నాన్నగారు (మోహన్ బాబు) చేశారు. అయితే, పాత్ర తీరుతెన్నుల్లో మార్పులు చేశాం. ఈ సినిమాకు పరుచూరి గోపాలకృష్ణ గారి మద్దతు ఎంతో ఉంది. కన్నప్ప కథ కోసం అనుసంధానించిన లొకేషన్స్ శివయ్య అనుగ్రహమే అనిపిస్తోంది అని చెప్పాడు.
కన్నప్ప
ఈ సినిమా గురించి మాట్లాడుతుండగా, “ఈ సినిమాను ప్రభాస్ చేసి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నారు. కానీ ప్రభాస్ ఎప్పుడూ తనకు ఈ కథ చేయాలనుందని చెప్పలేదు. ఒకవేళ అతను నిజంగా ఈ కథ చేయాలనుకునివుంటే, నేను ఈ ప్రాజెక్ట్‌ను తీసుకునే వాడిని కాదు” అని చెప్పాడు.అలాగే, “కృష్ణంరాజు గారి హయాంలోనే నేను ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించాను. ఆయన ఆశీస్సులు అందుకున్నాను. శ్రీకాళహస్తిలోని శివలింగం ఎలా ఉందో, మా సినిమాలో కూడా అచ్చం అలాగే చూపించాం అనే సంతృప్తి ఉంది” అని మంచు విష్ణు వివరించాడు.

భారీ అంచనాలు
ఈ సినిమాకు ముకుంద రంగనాథ్ దర్శకత్వం వహించగా, ఎం.ఎం. కీరవాణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. విఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన ఈ పాన్-ఇండియా చిత్రంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కనిపించబోతున్నారు.ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కన్నప్ప’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మంచు విష్ణు మాట్లాడుతూ, “ఈ సినిమా కన్నప్ప భక్తికి అంకితం. నా కెరీర్‌లో ఇదో మైలురాయి అవుతుంది” అని చెప్పాడు.ఈ చిత్రం శ్రీకాళహస్తి క్షేత్రానికి సంబంధించి భక్త కన్నప్ప కథను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. అయితే, ఇదివరకు వచ్చిన ‘భక్త కన్నప్ప’ (1976) సినిమా తరహాలో కాకుండా, కొన్ని ఊహాజనిత అంశాలను జోడించి గ్రాండ్ విజువల్స్‌తో రూపొందించారు.కన్నప్ప కథను ప్రపంచానికి తెలియజేయాలనే తపనతో ఈ సినిమా చేశాను. ఇది నా కెరీర్‌లో గొప్ప సినిమా అవుతుంది అని అన్నారు.