Manchu Vishnu శివ భక్తుడిగా మారిపోయాను మంచు విష్ణు

Manchu Vishnu : శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు

Manchu Vishnu : శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు డైనమిక్ హీరో విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్లు వేగంగా సాగుతున్నాయి.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. విశేషంగా ఈ సినిమాను ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.అందుకు అనుగుణంగా చిత్రబృందం విస్తృతంగా ప్రమోషన్లను చేపట్టింది.ఇటీవలే రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీమ్ పాల్గొని సినిమాపై అంచనాలు పెంచింది.ఈ కార్యక్రమంలో హీరో విష్ణు మంచు మాట్లాడుతూ “నేను ఆంజనేయ స్వామిని ఎంతగా ఆరాధించేవాడినో అందరికీ తెలుసు.

Manchu Vishnu శివ భక్తుడిగా మారిపోయాను మంచు విష్ణు
Manchu Vishnu శివ భక్తుడిగా మారిపోయాను మంచు విష్ణు

కానీ ‘కన్నప్ప’ చిత్రంతో శివ భక్తుడిగా మారిపోయాను.ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ పాత్ర ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించలేరు.ఈ సినిమా ద్వారా నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది” అని తెలిపారు.నటుడు బ్రహ్మాజీ తన అనుభవాన్ని షేర్ చేస్తూ “కన్నప్ప లాంటి గొప్ప చిత్రంలో భాగమవ్వడం నా అదృష్టం.ఇలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడు నిర్మాతలకు కృతజ్ఞతలు. మా అందరి కెరీర్‌ను ‘కన్నప్ప’ ముందు, ‘కన్నప్ప’ తరువాత అని మాట్లాడుకునేలా మారుస్తుంది. విశేషంగా నా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం విడుదల కావడం నాకు ఓ గొప్ప అనుభూతి. విష్ణు నటన చూసి ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయం. సినిమా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది” అని అన్నారు.కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషించిన రఘుబాబు మాట్లాడుతూ, “ఈ చిత్రంలో నటించాలన్నది నా అదృష్టం. ‘కన్నప్ప’ అద్భుతంగా తెరకెక్కింది.

విష్ణు మంచు ఈ సినిమాతో మరో స్థాయికి ఎదుగుతారు.సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీని ప్రేక్షకులు థియేటర్లలో తప్పక ఆస్వాదిస్తారు” అని ఆశాభావం వ్యక్తం చేశారు.దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాపై తన అనుభవాన్ని పంచుకుంటూ “2015లోనే విష్ణు ‘కన్నప్ప’ కథను అనుకున్నారు. 2016లో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుడిని దర్శించుకున్నాను. అప్పుడే ఈ కథకు నేను సిద్దమయ్యాను. ఇది కేవలం సినిమా కాదు శివ లీల. ఇంతకు ముందు నేను ‘మహాభారతం’ సీరియల్‌ను రూపొందించాను. ఆ సీరియల్‌ను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించారు. అలాగే ‘కన్నప్ప’ను కూడా ప్రేక్షకులు గౌరవంగా ప్రేమగా స్వీకరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్‌లాల్ వంటి మహామహులు నటించారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

Related Posts
కథానాయికగా జాన్వీ కపూర్
కథానాయికగా జాన్వీ కపూర్

కథానాయికగా జాన్వీ కపూర్ అందాల తార జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్వీ, గ్లోబల్ స్టార్ రామ్ Read more

Nagarjuna: నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న సినీ నటుడు నాగార్జున
akkineni nagarjuna

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అనంతపురంలో కల్యాణి జువెలర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం ప్రయాణిస్తుండగా అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు ఈ ఉదయం నాగార్జున పుట్టపర్తికి విమానంలో Read more

ఎన్టీఆర్ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేశారా
prabhas and jr ntr

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్, ఆ తర్వాత కల్కి చిత్రంతో 1000 Read more

చిరంజీవి వద్దనుకున్న సినిమాలు భారీ విజయం
చిరంజీవి వద్దనుకున్న సినిమాలు భారీ విజయం

మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా ఒక అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. మూడు దశాబ్దాల పాటు టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగి, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *