हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Manchu Lakshmi: కన్నప్ప సినిమాపై మనసులో మాట బయట పెట్టిన మంచు లక్ష్మి

Sharanya
Manchu Lakshmi: కన్నప్ప సినిమాపై మనసులో మాట బయట పెట్టిన మంచు లక్ష్మి

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన విషయం – “కన్నప్పలో మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఎందుకు నటించలేదు?” అనే ప్రశ్న. దీనిపై మంచు లక్ష్మి తాజాగా స్పందిస్తూ రూమర్లకు చెక్ పెట్టేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“తాను నటిస్తే మిగతా వాళ్లు కనిపించరట!”

తాను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ కనిపించరంటూ సెటైర్ వేశారు. ఈ మూవీలో తనకు సరిపోయే పాత్ర లేదని భావిస్తున్నానని, అందుకే విష్ణు తనకు అవకాశం ఇవ్వలేదని అనుకుంటున్నానన్నారు. ఒకవేళ తాను చేయగలిగే పాత్ర ఉంటే విష్ణు అవకాశం ఇచ్చేవాడేమోనని, ఆ విషయం గురించి విష్ణునే అడగాలని చెప్పింది.

“ఫ్యామిలీ మూవీ అనే ట్యాగ్ తప్పించుకోవాలనుకున్నారు!”

ఇప్పటికే తమ ఫ్యామిలీ గతంలో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిందని కన్నప్ప మూవీలో తాను కూడా నటించి ఉంటే అది ఒక ఫ్యామిలీ మూవీ అని అంతా అనుకునేవారని, ఇప్పటికే తమ ఫ్యామిలీ చాలా మూవీల్లో కలిసి నటించామని లక్ష్మి పేర్కొంది. తనకు నటించే అవకాశం ఇవ్వకపోవడంతో తమ్ముడు విష్ణుకు తన మద్దతు లేదని అనుకుంటున్నారని, అది నిజం కాదని చెప్పుకొచ్చింది. సినిమాలో అవకాశం ఇవ్వలేకపోయినంత మాత్రాన తమ మధ్య ఏదో ఉందని అనుకోవద్దని చెప్పింది. తన మద్దతు ఎప్పుడూ విష్ణుకు ఉంటుందని పేర్కొంది.

“రీసెంట్‌గా లెస్బియన్ మూవీలో కనిపించిన లక్ష్మి”

మంచు లక్ష్మి ఇటీవల పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. గతంలో వరుస సినిమాలు చేసిన లక్ష్మి గత ఏడాదిన్నరగా ఆమె నుంచి ఎలాంటి మూవీలు రాలేదు. రీసెంట్‌గా లెస్బియన్ మూవీలో కనిపించింది. అయితే కన్నప్ప మూవీలో లక్ష్మి నటించకపోవడంతో రకరకాల రూమర్లు వచ్చాయి. ఈ వదంతులకు చెక్ పెడుతూ లక్ష్మి ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది. మంచు లక్ష్మి ఇచ్చిన వివరణతో “కన్నప్ప” మూవీపై ఉన్న అనేక అనుమానాలకు ఓ హద్దు పడింది.

Read also: Eleven: కవలలను చంపే సన్నివేశాలతో ఆకట్టుకునే ‘ఎలెవన్’ ఓటీటీలో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870