Air India: ఎయిరిండియా విమానంలో వ్యక్తి మృతి

Air India: ఎయిరిండియా విమానంలో వ్యక్తి మృతి

ఢిల్లీ నుండి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకుల్లో ఒకరు గాల్లో ప్రయాణిస్తూనే అనారోగ్యంతో మరణించడం కలకలం రేపింది.ఢిల్లీ నుంచి ల‌క్నో వెళుతున్న విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతతో మృతి చెందాడు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఈ రోజు ఉదయం 8 గంటల 10 నిముషాలకు ల‌క్నో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయ్యింది.

ఆసిఫ్ ఉల్లా అన్సారీ

విమాన ప్రయాణంలో ఉన్న ఇతర ప్రయాణికులు అందరూ విమానం దిగుతుండగా, ఒక వ్యక్తి మాత్రం సీటులోనే కదలకుండా ఉండటాన్ని క్లీనింగ్ సిబ్బంది గమనించింది. అతడిని హౌస్‌కీపింగ్ సిబ్బంది పలుమార్లు పిలిచినా స్పందించకపోవడంతో విమానంలోని ఓ డాక్టర్‌ను పిలిపించారు. పరీక్షించిన వైద్యుడు ఆసిఫ్ ఉల్లా అన్సారీ అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

కార‌ణాలు

ఆసిఫ్ మృతి గాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.విమానం ఎక్కిన త‌ర్వాత అత‌డికి ఇచ్చిన ఆహార ప‌దార్థాలు అలాగే ఉండ‌డం, సీటు బెల్టు కూడా తీయ‌క‌పోవ‌డంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.హార్ట్ ఎటాక్ లేదా ఊపిరితిత్తుల సమస్య కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఆసిఫ్‌కు పూర్వపు అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారు.

Air India 3

పోస్టుమార్టం

ఆసిఫ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక కోసం ఆసుపత్రికి తరలించారు.ఎయిరిండియా యాజమాన్యం ఈ ఘటనపై విచారణ చేపట్టింది.విమానంలో ఏమైనా అసాధారణ సంఘటనలు జరిగినాయా? అనే దిశగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.

ప్రయాణికుల భద్రత

ఈ సంఘటన విమాన ప్రయాణంలో ఆరోగ్య భద్రతపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలా?విమానసిబ్బంది తగినంత వైద్య సహాయం అందించగలరా?గాల్లో ఉన్న సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే ఏం చేయాలి?ఈ అంశాలపై విమానయాన సంస్థలు భవిష్యత్తులో మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.ఆసిఫ్ మృతికి గల ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే తెలుస్తాయి.

Related Posts
Central Govt : యథాతథంగా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు
Interest rates on small savings schemes remain unchanged

Central Govt: కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ వంటి Read more

ప్రపంచ దేశాల విద్యార్థులపై ట్రంప్ ఇజం

అమెరికాలో వలస విధానాలు, ముఖ్యంగా విద్యార్థులు మరియు పని సంబంధిత వీసాల విషయంలో, తాజాగా గణనీయమైన మార్పులు రావడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా, అమెరికా Read more

Donald Trump :41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం
41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ కు ట్రంప్ సిద్ధం

ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్‌.. అమెరికాను మళ్లీ ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన Read more

పట్టాలు తప్పిన 20 బోగీలు‌.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
train

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలో గూడ్స్ రైలు భారీ ప్రమాదానికి గురైంది. బొగ్గుతో లోడ్ అయిన ఈ రైలు బిలాస్‌పూర్ నుంచి కట్నీ వెళ్తుండగా, ఖోంగ్‌సార్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *