కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ చట్టం పశ్చిమ బెంగాల్‌లో అమలు కాదు అని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు ఈ చట్టం మంగళవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దాన్ని అనుసరించి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొన్నారు పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కొందరు నిరసనకారులు రాళ్ల దాడులకు పాల్పడ్డారు.ఈ ఉదంతాలపై స్పందించిన సీఎం మమతా, “ప్రతి ప్రాణం విలువైనది. రాజకీయ ప్రయోజనాల కోసం అల్లర్లు అర్థం లేవు” అని అన్నారు.

అల్లర్లకు పాల్పడేవారు సమాజానికి ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు అటువంటి వారిపై చట్టం ప్రకారం చర్యలు తప్పవని స్పష్టంచేశారు.మతం పేరుతో హింసకు ప్రోత్సాహం ఇచ్చే పార్టీలు ఉంటాయని మమతా ఆవేదన వ్యక్తం చేశారు. “మతం అంటే మానవత్వం, ప్రేమ, సహనంతో కూడిన జీవితం” అని పేర్కొన్నారు. ప్రజలు మతసామరస్యాన్ని కాపాడుకోవాలనే ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ చట్టం పట్ల అభ్యంతరాలుంటే కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. “ఇది మేము తీసుకురాలేదు. కేంద్రం చట్టం తెచ్చింది ప్రశ్నలు వాళ్లను అడగాలి,” అని మమతా అన్నారు. తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టంగా చెప్పారు.ఇటువంటి సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని మమతా పిలుపునిచ్చారు. రాజకీయంగా లాభపడాలనే ఉద్దేశంతో మతాలను వాడుకోవడం తప్పని ఆమె పేర్కొన్నారు.
Mamata Banerjee : సోనియా, రాహుల్ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం !