rekhachithram

మలయాళ మూవీ రికార్డ్

మలయాళంలో వేణు కున్నప్పిలి నిర్మించిన ఈ సినిమాకి, జోఫిన్ చాకో దర్శకత్వం వహించాడు. మర్డర్ మిస్టరీ తో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది.క్రితం ఏడాది ఆరంభం నుంచే మలయాళ ఇండస్ట్రీ తన విజయ పరంపరను కొనసాగించింది. అలాగే ఈ సారి కూడా ‘రేఖా చిత్రం’ సినిమాతో తొలి హిట్ ను నమోదు చేసింది. అసిఫ్ అలీ .. అనశ్వర రాజన్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

Advertisements
Rekhachithram

కేవలం 6 నుంచి 9 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 13 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. 25 రోజులలో 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సిద్ధిఖీ .. జగదీశ్ .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ సినిమాలో, మమ్ముట్టి ప్రత్యేకమైన పాత్రను పోషించడం విశేషం. థియేటర్లలోకి దిగిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా తన జోరు చూపించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. పోలీస్ ఆఫీసర్ వివేక్ గోపీనాథ్ ఒక కేసు విషయంలో సస్పెండ్ అవుతాడు. ఆ తరువాత ఆయన నిజాయితీని గుర్తించి ఒక మర్డర్ మిస్టరీ కేసును అప్పగిస్తారు. ఆ హత్య కేసును పరిశోధిస్తూ వెళ్లిన ఆయనకి, 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్యతో ఈ హత్య కేసు ముడిపడి ఉందనే విషయం ఆయనకి అర్థమవుతుంది. అప్పుడు జరిగిన ఆ హత్య ఎవరిది? ఈ కేసును వివేక్ గోపీనాథ్ ఎలా ఛేదిస్తాడు? అనేది కథ. ఈ నెలలోనే ఈ సినిమా ‘సోనీ లివ్’ లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది.

Related Posts
జాట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.
జాట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ పెద్ద మార్పు చూస్తున్నారు.సలార్, కల్కి, పుష్ప 2 లాంటి సినిమాలు బాలీవుడ్ సింగిల్ స్క్రీన్స్‌లోకి కొత్త జోష్ తీసుకువచ్చాయి.మన Read more

దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ – తమన్
game changer jpg

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. డైరెక్టర్ శంకర్ (Shankar) - మెగా పవర్ స్టార్ రామ్ Read more

Vishwambhara : మెగాస్టార్ మూవీ.. VFX కోసం రూ.75 కోట్లు?
విశ్వంభర' ఫస్ట్ సింగిల్ రామ రామ విడుదల

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర' సినిమాకు సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) Read more

రజినీకాంత్‏ను కలిసిన చెస్ ఛాంపియన్ గుకేశ్‏..
Rajinikanth Gukesh

సూపర్ స్టార్ రజినీకాంత్ చెస్ గ్రాండ్ మాస్టర్ డి. గుకేశ్‌ను సన్మానించారు భారత చెస్ ప్రాడిజీ, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ తన Read more

Advertisements
×