మకరం రాశి

మకరం రాశి

మకరం రాశి

19-03-2026  |  గురువారం
ఆదాయం 02
వ్యయం 08
రాజపూజ్యం 01
అవమానం 02

మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం లగ్నం, ద్వితీయంలో రాహువు, తృతీయంలో శనీశ్వరుడు, షష్టమం, సప్తమం, అష్టమంలో గురువు, అష్టమం, సప్తమంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు లక్ష్మి నారాయణ పాశుపత హెూమం జరిపించండి. చేతికి కుబేర కంకణం ధరించండి. అధునాతన సాంకేతిక పరికరాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని కొత్త అంశాలను నేర్చుకోవాలన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకున్న విధంగా నెరవేరుతాయి. శుభకార్యాలు వివాహము శంకుస్థాపన గృహప్రవేశము ఇతర శుభకార్యాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. మంచి పేరుని పొందుతారు. ఎంత కాలం నుండి ఒక ముఖ్యమైన విషయం గురించి ఇంట్లో వాళ్ళతో చర్చించాలన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. కానీ కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని భయపడి ఆగిపోవడమే ఏర్పడుతుంది.

కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంగీతము, సాహిత్యము, నాట్యము, ఇన్స్ట్రూమెంట్స్ నేర్చుకోవడము వాడికి సంబంధించిన కచేరీలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. విందు వినోదాల పట్ల ఆకర్షితులవుతారు. అయిన వాళ్ళతో మనసు విప్పి సంతోషాన్ని పంచుకోవాలి. అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాహనానికి సంబంధించి లేదా ఇంటికి సంబంధించిన రుణాలను తీర్చి వేయాలన్న ఆలోచనలు బాధిస్తాయి. రుణాలకు సంబంధించిన విషయాలలో అనుకున్నది ఒకటి జరిగినది. మరొకటి అన్న విధంగా లెక్కలు తారు మారయ్యాయోగాని అవి తీర్చలేని భారంగా మారటం జరుగుతుంది. నూతన వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కొన్ని కొత్త పరిచయాల ద్వారా మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. దూరపు దృష్టితో ఆలోచించి ఏర్పడిన స్నేహాల గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. సుదీర్ఘకాలం కొనసాగే స్నేహాలకి బంధుత్వాలకే ప్రాధాన్యతను ఇస్తారు. ఇది మీలో వచ్చే కొత్త మార్పుగా కనపడుతుంది. కొంతమంది పట్ల మీకున్న గౌరవం భయము తారస్థాయికి చేరుకుంటుంది.

ప్రభుత్వపరమైన అధికారులు వాళ్లతో పరిచయాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. రికమండేషన్ల ద్వారా, సిఫార్సుల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. లీజులు, లైసెన్సులు, టెండర్లకు సంబంధించిన అంశాలు అనుకూలిస్తాయి. ఒకానొక చోట వ్యాపార అభివృద్ధి కోసం స్థలాన్ని లీజుకు తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. అవి ద్వితీయ ప్రయత్నంలో నెరవేరుతాయి. కొంతమంది పట్ల మీకున్న అభిమానము వాళ్లు అందుకు అర్హులు కాకపోయినట్లు ఆలస్యంగా తెలుసుకుంటారు. ఆహార నియమాల పట్ల జాగ్రత్తలు అవసరం, ఆకలీ, నిద్ర, ఆహారం వలన ఆరోగ్యం పాడైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈఎన్టి, లంగ్స్, లివర్ వీటికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడతారు. ఆలస్యంగా రికవరీ అవుతారు. దీనివలన ఎక్కువగా నష్టపోతారు. పెంపుడు జంతువులను పెంచుకోవాలని ఆలోచనలు కలిగి ఉంటారు. సంవత్సర ద్వితీయార్థంలో సంతానం అదృష్టం కొన్నిటిని తెచ్చుకోవడం, పెంచడం జరుగుతుంది. కొంతమందితో ఉన్న కలహాలు, గొడవలు పరిష్కరించుకోవాలన్న ఆలోచనలు ఇరు వర్గాలకు రాకపోవచ్చు. మధ్యవర్తుల ప్రమేయంతో కొన్నింటికి మీరు మొక్కుబడిగా ఒప్పుకుంటారు. పని జరిగిన జరగకపోయినా మనకు వచ్చే నష్టం గానీ, ప్రయోజనం గానీ ఏమీ లేదన్న విధంగా మీ ధోరణి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీ వాళ్ళు మీకు మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ఒకటికి పది సార్లు ఆలోచించడం, భయపడడం, వెనుతిరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, బ్యాంక్ ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎన్నో ఆర్డర్లను, అవకాశాలను సొంతం చేసుకోగలుగుతారు. పై అధికారుల నుండి వేధింపులు, ఒత్తిడి తప్పకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మనకు ఉన్నటువంటి అనారోగ్య అలవాట్లు, వ్యసనాలు అన్నిటికన్నా పెద్ద తలనొప్పిగా మారి, పెను సమస్యకి దారితీస్తాయి. మీ ఆధ్వర్యంలో దైవాధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించగలుగుతారు. పలువురి ప్రశంసలను పొందగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కొనసాగించడానికి ఉన్న చికాకులు, అడ్డంకులు నెమ్మదిగా ఒక్కొక్కటి తొలగిపోవడం ఆనందానికి కారణం అవుతుంది.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం 60%
సంపద 80%
కుటుంబం 100%
ప్రేమ సంభందిత విషయాలు 60%
వృత్తి 80%
వైవాహిక జీవితం 80%
Sun

వారం - వర్జ్యం

తేది : 19-03-2026, గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం , చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు , శుక్లపక్షం ఉత్తరాభాద్ర కార్తె
అమావాస్య ఉ.6.53 , సా. పాడ్యమి తె.4.51 , ఉత్తరాభాద్ర తె.4.03
వర్జ్యం: మ.2.26-3.52
రాహుకాలం: మ.1.30 - 3.00

మీకు నచ్చవచ్చు