న్యూజిలాండ్ భూభాగం మరోసారి ప్రకృతి ధాటికి బీబత్సం అయ్యింది. రిక్టర్ స్కేలు మీద 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దేశ వ్యాప్తంగా ప్రకంపనలను రేపింది. అనేక ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలతో భవనాలు కంపించడంతో కొందరు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. శక్తివంతమైన ప్రకంపనలు అనేక నిమిషాలు కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
మాక్వేరీ ద్వీపం ప్రాంతాన్ని తాకినా భూకంపం
ఈ భూకంపం ప్రభావం మాక్వేరీ ద్వీపం ప్రాంతాన్ని కూడా తాకింది. న్యూజిలాండ్‌కు 1200 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో ఉన్న ఈ ద్వీపం సమీపంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇది సముద్ర ప్రాంతమైనందున సునామీ ప్రమాదం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటివరకు సునామీ హెచ్చరికలపై స్పష్టత లేదు.
Read Also : Gaurav Bhatia: ఉగ్రవాదానికి మా బుల్లెట్ తోనే సమాధానం
భూకంపం వల్ల ఎంత మేరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం
ప్రస్తుతం ఈ భూకంపం వల్ల ఎంత మేరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై అధికారిక సమాచారం ఇంకా అందాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. న్యూజిలాండ్ ప్రజలు భూకంపాలకి అలవాటుపడినప్పటికీ, ఈ స్థాయిలో భూకంపం రావడం ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది.