mahesh rajamouli movie

బొర్రా గుహల్లో మహేశ్ బాబు సినిమా షూటింగ్..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రం గురించి ప్ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలోని ప్రసిద్ధ బొర్రా గుహల్లో చిత్రీకరించాలని రాజమౌళి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జక్కన్న తన టీమ్‌తో కలిసి గుహల ప్రాంతాన్ని పరిశీలించినట్లు సమాచారం.

SSMB29గా పిలవబడుతున్న ఈ సినిమా కథ ప్రకారం, అధికశాతం టాకీ పార్ట్‌ను ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇందులోని కొన్ని కీలక సన్నివేశాలు సహజ సౌందర్యం అవసరం కావడంతో బొర్రా గుహలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గుహల్లో చిత్రీకరణ వల్ల ఆ ప్రాంతం మరింత ప్రసిద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ చిత్రం మహేశ్ బాబు కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదిగా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. సాహసోపేతమైన కథతో రూపొందనున్న ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్, భారీ సెట్స్ ఉపయోగించనున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ చిత్రానికి పనిచేయనున్నట్లు టాక్.

ఇదిలా ఉండగా, సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ప్రియాంక, ఈ సినిమాతో మరోసారి తెలుగులోకి అడుగుపెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ భారీ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించిందని సమాచారం.

Related Posts
మార్చిలో మోదీ మారిషస్ పర్యటన
మోదీ మారిషస్ పర్యటన: ప్రత్యేక అతిథిగా సాదర స్వాగతం

భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11-12 తేదీల్లో మారిషస్ పర్యటన చేయనున్నారు. 57వ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. మారిషస్ ప్రధాని నవీన్ Read more

Bangladesh : హిందూ భార్యాభర్తలు పై జిహాదీలు దాడి తర్వాత ఆమె నాలుకను కత్తితో?
Bangladesh : హిందూ భార్యాభర్తలు పై జిహాదీలు దాడి తర్వాత ఆమె నాలుకను కత్తితో?

Bangladesh : హిందూ భార్యాభర్తలు పై జిహాదీలు దాడి తర్వాత ఆమె నాలుకను కత్తితో? బంగ్లాదేశ్ చిట్టగాంగ్‌లో హిందూ భార్యాభర్తలు ఆఫీసు పని ముగించుకుని ఇంటికి తిరిగి Read more

ప్రజల వద్దకు కాంగ్రెస్ ‘ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్’
cm revanth reddy district tour

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తొలి సంవత్సరం పూర్తి కాబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం ప్రజలకు సాధించిన ఫలితాలను విస్తృతంగా వివరించేందుకు ప్రగతి నివేదికను Read more

ఛార్‌ధామ్ యాత్రకు షెడ్యూల్ వెల్లడించిన ఉత్తరాఖండ్
Uttarakhand announced schedule for Chardham Yatra

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం న్యూఢిల్లీ: ఈ ఏడాది ఛార్‌ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 30 నుంచి ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభమవుతుందని Read more