athidhi re release

థియేటర్స్ లోకి మళ్లీ ‘అతిధి’

మహేశ్ బాబు అభిమానులకు మరోసారి పండగ చేసుకునే సందర్భం రాబోతోంది. 2007లో విడుదలైన ‘అతిథి’ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. మహేశ్ బాబు పాత సినిమాల్ని రీ-రిలీజ్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో ‘పోకిరి’, ‘మురారి’ వంటి హిట్ సినిమాలు తిరిగి విడుదలై అభిమానుల నుంచి మంచి స్పందన పొందాయి. ఇప్పుడు అలాగే రాబోతుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతిథి’ 2007లో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ పరంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా కథ, కథనాల విషయంలో కొంత మంది విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, మహేశ్ బాబు అభిమానులలో ఈ సినిమా ప్రత్యేక స్థానం పొందింది. ‘అతిథి’ చిత్రాన్ని కొత్తగా డిజిటల్ రిమాస్టర్ వర్షన్‌లో విడుదల కానుంది.

సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో మార్పులు చేసి ప్రేక్షకులకు నూతన అనుభూతిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ రాజమౌళి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వేసవి లో ఈ మూవీ షూటింగ్ మొదలుకాబోతుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే రెండేళ్ళైనా పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో మహేష్ గత చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానుల్లో సంతోషం నింపుతున్నారు నిర్మాతలు. గతంలో ‘పోకిరి’ రీ-రిలీజ్ ఘన విజయాన్ని సాధించింది. ‘అతిథి’తోనూ అదే స్థాయి స్పందన ఉండే అవకాశం ఉందని మహేశ్ బాబు అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎంత వరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

Related Posts
400 ఎకరాల్లో మెగా వ్యవసాయ మార్కెట్ – మంత్రి తుమ్మల
thummala

హైదరాబాద్ సమీపంలోని కోహెడలో ప్రపంచ స్థాయి మెగా వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటన చేసారు. ఈ మార్కెట్ నిర్మాణానికి రూ.2 Read more

భారత్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రష్యా సిద్ధం: వ్లాదిమిర్ పుతిన్
narendra modi and vladimir putin

భారత ప్రధాని నరేంద్ర మోదీ యొక్క 'ఇండియా-ఫస్ట్' విధానం మరియు 'మేక్ ఇన్ ఇండియా' ప్రణాళికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. రష్యా భారత్‌లో ఉత్పత్తి Read more

హైదరాబాద్ లో గ్రాండ్ గా యమహా కామిక్ కాన్ లాంచ్
Yamaha Grand Debut at Comic

ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ 15 నవంబర్ 2024 నుండి 17 నవంబర్ 2024 వరకు హైదరాబాద్‌లో జరిగే కామిక్ కాన్ ఇండియా అనే దేశంలోని Read more

రైతులకు గుడ్ న్యూస్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంపు
రైతులకు గుడ్ న్యూస్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంపు

2025 ఫిబ్రవరి 1న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన తొలి పూర్తి బడ్జెట్‌ను పార్లమెంటులో సమర్పించారు. ఈ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక Read more