హత్య కేసు ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా

హత్య కేసు ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా

మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్ ఇటీవలే దారుణంగా హత్యకు గురైన విషయం అందరికీ తెలిసిందే. కాగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రేపింది.ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆయనను రాజీనామా చేయాలని ఆదేశించారని సమాచారం. ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ, ధనంజయ్ రాజీనామాను తాను ఆమోదించి, గవర్నర్‌కు పంపినట్లు తెలిపారు.

ధనంజయ్ రాజీనామా

మహారాష్ట్రలోని బీడ్ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9వ తేదీన కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆపై దారుణంగా హింసించి హత్యకు పాల్పడ్డారు. అయితే ఈ హత్య కేసు బయటకు రాగా దీంట్లో మంత్రి ధనంజయ్ ముండే హస్తం కూడా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈయన సహాయకుడు వాల్మిక్ కరాడ్ ఇందులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయ్యారని తెలియగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. దీంతో మంత్రికి ఈ కేసుతో సంబంధం ఉందంటూ మరింతగా వార్తలు వచ్చాయి.

రాజీనామాను ఆమోదించిన ఫడ్నవిస్

రాజీనామా చేయాలని ఆయనను సీఎం ఫడ్నవిస్ ఆదేశించినట్టు సమాచారం. ఈ అంశంపై ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ ధనంజయ్ రాజీనామాను తాను ఆమోదించి, గవర్నర్ కు పంపానని తెలిపారు. 

20munde 1

ధనంజయ్ ముండే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో కీలక నేతగా ఉన్నారు. సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్య కేసులో ధనంజయ్ సన్నిహితుడు వాల్మిక్ కరాడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ ధనంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు.ప్రతిపక్షాలతో పాటు పలువురు మహాయుతి నాయకులు సైతం మంత్రి ధనంజయ్ ముండేపై విమర్శలు చేశారు. ఈ కేసులో మంత్రిని తప్పించేందుకు దర్యాప్తు అధికారులు, స్థానిక రాజకీయ నేతలు కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ గొడవ చేశారు. ముఖ్యంగా మంత్రి ధనంజయ్ ముండేకు గట్టి మద్దతు ఇస్తున్న ఎస్సీపీ చీఫ్ అజిత్ పవార్ సహా మంత్రికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను తాను సమర్పించినట్లు సామాజిక కార్యకర్త అంజలి దమానియా చెప్పడంతో గొడవ మరింత ఎక్కువైంది.

ఎన్సీపీ (శరద్ పవార్) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కూడా ధనంజయ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ధనంజయ్ మాట్లాడుతూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని సీఎం ఫడ్నవిస్ లేదా డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్తే వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు. ఈ క్రమంలో చివరకు ఆయన రాజీనామా చేశారు.

Related Posts
తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో 26 రైళ్లకు హాల్ట్ లు
train

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు Read more

పర్వేష్ వర్మకే సీఎం పగ్గాలు?
పర్వేష్ వర్మకే సీఎం పగ్గాలు?

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ, 10 రోజులు పూర్తయినా ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై Read more

ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి డిశ్చార్జ్
Vice President discharged f

భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆదివారం తెల్లవారుజామున ఛాతీ నొప్పి కారణంగా ఢిల్లీ AIIMS (అఖిల భారత వైద్య Read more

భారీ ఎన్‌కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
Huge encounter.. 11 Maoists killed

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని ఊసూరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో భ‌ద్రతా బ‌ల‌గాలు బుల్లెట్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *