Maharashtra assembly polls results

మహారాష్ట్రలో దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అధికార పార్టీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ 145 స్థానాలను దాటిన మహాయుతి.. ప్రస్తుతం 188 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, మహావికాస్ అఘాడీ కూటమి 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

మరోవైపు, జార్ఖండ్ లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 41 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీయే కూటమి 38 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతుండటంతో జార్ఖండ్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కాగా, ఆయా పార్టీల్లో కిందిస్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం స్పందిస్తూ.. ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చుని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా, శనివారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఎన్డీయే కూటమికి చెందిన కీలక నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. బారామతిలో పవార్ కుటుంబ పోటీలో అజిత్ ముందున్నారు.

Related Posts
ఇండస్ట్రీలో విషాదం సినీ డైరెక్టర్ మృతి
ఇండస్ట్రీలో విషాదం సినీ డైరెక్టర్ మృతి

మలయాళ సినిమా పరిశ్రమకు ఈ రోజు ఒక పెద్ద శోకం మిగిలింది. ప్రముఖ దర్శకుడు షఫీ (56) గుండెపోటుతో ఆప్తుల నుండి విడిపోయి, ఆదివారం కన్నుమూశారు. ఈ Read more

రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త
Good news for retired emplo

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు తపాలా శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడం లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు ఇండియా పోస్ట్ Read more

Eyesight Problems : పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా
child eyesight problems

ఈ రోజుల్లో చిన్న వయసులోనే పిల్లల్లో కంటి చూపు సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, మొబైల్, టీవీ, కంప్యూటర్‌లకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల Read more

రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు.
రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబు.

రెండవ ప్రపంచ యుద్ధం మచ్చలు ఇప్పటికీ కనపడుతూనే ఉన్నాయి. 2024లో అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో రెండవ ప్రపంచ యుద్ధం నాటి 182 కిలోల బాంబును నిర్వీర్యం చేశారు. Read more