"Mahanadu" in Kadapa District : Atchannaidu

కడప జిల్లాలో “మహానాడు” : అచ్చెన్నాయుడు

అమరావతి: టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే “మహానాడు” కార్యక్రమాన్ని ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం పొలిట్ బ్యూరోలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ సీనియర్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Advertisements

ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించాలని పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు. మహానాడు తేదీలను ఖరారు చేసినట్లు చెప్పారు. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మహానాడులో జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును ఎన్నుకుంటామని వెల్లడించారు.

image

ఈ మహానాడుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ హయాంలో కుదించిన స్థానిక సంస్థల్లో బీసీ కోటా రిజర్వేషన్లు పునరుద్దరించేందుకు చట్టపరమైన అంశాలు పరిశీలించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. మరోవైపు జిల్లాల పునర్విభజనపై సైతం చర్చ జరిగింది. వైసీపీ హయాంలో జిల్లాల పునర్విభజన అంశంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలని టీడీపొ పొలిట్ బ్యూరో నిర్ణయించినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు మహానాడులోపు నిర్వహించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. కోటి సభ్యత్వాలు దాటిన నేపథ్యంలో ఈ నమోదు మరింత ముందుకుసాగాలని టీడీపీ పొలిట్ బ్యూరో స్వాగతించింది.

Related Posts
ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి
President to Mangalagiri AI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో Read more

పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. Read more

హోలీ జరుపుకొనే ఇతర దేశాలు
హోలీ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ జరుపుకుంటారో తెలుసా?

హోలీ పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఘనంగా జరుపుకుంటారని మీకు తెలుసా? హిందూమత సంప్రదాయానికి చెందిన ఈ రంగుల పండుగ భారతీయ సంస్కృతి ప్రభావంతో Read more

కిడ్నీలో రాళ్లు ఎలా వస్తాయంటే?
kidney stones

ప్రస్తుతం చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. మూత్రంలో ఉండే కొన్ని రసాయనాలు శరీరం నుంచి పూర్తిగా బయటకు వెళ్లకుండా లోపలే నిల్వ ఉండడం వల్ల Read more

Advertisements
×