हिन्दी | Epaper
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Maha Kumbh: కోట్ల ఆదాయం..సంతోషం-ఆదాయపన్నుతో ఆవిరి

Sharanya
Maha Kumbh: కోట్ల ఆదాయం..సంతోషం-ఆదాయపన్నుతో ఆవిరి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి భక్తుల తాకిడి కాదు, ఓ బోటు కుటుంబం రూ. 30 కోట్ల ఆదాయం పొందడం, ఆపై ఇంకమ్ ట్యాక్స్ శాఖ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రయాగ్‌రాజ్‌లోని అరైల్ గ్రామానికి చెందిన బోటుమ్యాన్ పింటూ మహ్రా కుటుంబం కుంభమేళా సమయంలో త్రివేణి సంగమం వద్ద భక్తులను సరఫరా చేయడానికి 130 బోటులను నడిపింది. భారీ భక్తుల రద్దీ కారణంగా, ఒక్కో రైడ్‌కు రూ. 1000 వరకు వసూలు చేశారు. 45 రోజుల్లో రూ. 30 కోట్లకు పైగా ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అంశాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో వెల్లడించడంతో, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

1736747966 9879

ఆదాయపు పన్ను శాఖ షాక్ – రూ. 12.8 కోట్ల ట్యాక్స్ నోటీసు

ఒక్కసారిగా కోట్ల రూపాయలు సంపాదించిన పింటూ మహ్రా ఫ్యామిలీకి ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం, వారి ఆదాయంపై రూ. 12.8 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపింది. ఈ పరిణామం బోటు కుటుంబానికి పెద్ద షాకుగా మారింది. పెద్ద మొత్తంలో సంపాదన వచ్చినా, అనుభవం లేని కుటుంబానికి పన్ను వ్యవహారాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పింటూ ఫ్యామిలీ పన్ను నోటీసులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. SEBI రీసెర్చ్ అనలిస్ట్ ఏకే మంధన్ ఈ విషయంపై స్పందిస్తూ, “బోటుమ్యాన్ పింటూ తన జీవితంలో ఎన్నడూ ఊహించని స్థాయిలో డబ్బు సంపాదించాడు. కానీ ఇప్పుడు ఆ డబ్బే అతనికి శాపంగా మారింది.” అని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఒక్కో రైడ్‌కు రూ. 500 మాత్రమే వచ్చేది, అది కూడా రోజుకు ఒకటి రెండు రైడ్లు మాత్రమే. కానీ కుంభమేళా కారణంగా భారీ డిమాండ్ రావడంతో అతను బాగా సంపాదించాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పన్నుల నోటీసులతో మళ్లీ ఒడిదుడుకుల బాటలోకి నెట్టేసింది. అంటూ సోషల్ మీడియాలో చాలా మంది ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం 1961 సెక్షన్లు 4, 68 ప్రకారం, పన్ను ఎగవేసిన వారు భారీ జరిమానా లేదా లీగల్ కేసులకు గురయ్యే అవకాశముంది. కాగా, పింటూ మహ్రా కుటుంబానికి ఇప్పటికే పన్ను నిపుణులు సంప్రదించి లీగల్ మద్దతు పొందే ఆలోచనలో ఉంది.

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో అనుకోకుండా 30 కోట్లు సంపాదించిన బోటు కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. రూ. 12.8 కోట్ల ట్యాక్స్ విధించడంతో, బోటుమ్యాన్ పింటూ మహ్రా కుటుంబం ఇప్పుడు పెద్ద ఆర్థిక సమస్యను ఎదుర్కొంటోంది. ఒక‌ప్పుడు పింటూ ఫ్యామిలీ నెల‌లో రూ. 15వేలు సంపాదించేందుకు బాగా క‌ష్ట‌ప‌డేవాళ్ల‌ని, అలాంటిది ఇప్పుడు ఒకే ఏడాదిలో రూ. 12.8 కోట్ల ప‌న్ను క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు. ఈ ఘటన ఇంకా పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించినా, పన్నుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870