మధ్య ప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మధ్య ప్రదేశ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వివాదాస్పద వ్యాఖ్యలు.ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని రేపాయి. ప్రజలు ప్రభుత్వాన్ని అధికంగా ఆశ్రయిస్తున్నారని, ఇదొక చెడు అలవాటుగా మారిందని, సమాజ అభివృద్ధికి ఇది సహాయపడదని ఆయన పేర్కొన్నారు.శనివారం మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో జరిగిన వీరాంగ రాణి అవంతిబాయి లోధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిత్యం వినతిపత్రాలతో వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలలో “అడిగే అలవాటు” పెరిగిపోతోందని, ఇది సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని వివరించారు. ప్రభుత్వ అధికారులు, నాయకులు రావగానే వారిని వినతిపత్రాలతో ముంచెత్తడం సరికాదన్నారు.

Prahlad Patel

పటేల్ మాట్లాడుతూ

ప్రహ్లాద్ సింగ్ పటేల్ మాట్లాడుతూ, ఉచితాలపై అధికంగా ఆధారపడటం వల్ల పని చేయాలనే ఆలోచన దూరమవుతోందని అన్నారు. భిక్షాటన చేసి సమాజం బలహీనంగా మారుతుందని, దీనివల్ల ప్రగతికి ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు. అంతేకాకుండా, ధైర్యవంతులైన మహిళల పట్ల గౌరవం పెంపొందించుకోవడం ముఖ్యం అని, ఉచితాలపై ఆకర్షితులయ్యే సంస్కృతిని ప్రోత్సహించడం సరైన మార్గం కాదని అన్నారు.

కాంగ్రెస్ నాయకుల తీవ్ర స్పందన

మంత్రి వ్యాఖ్యలు విపక్షాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలను భిక్షాటన చేసే వ్యక్తులతో పోల్చడం దారుణమని, ఇది ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలు నెరవేర్చమని అడిగితే, అది యాచించడమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులే ఓట్ల కోసం ప్రజలను అడుగుతారని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం ఈ వివాదం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. మంత్రి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

మంత్రి చేసిన వ్యాఖ్యలు

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ప్రస్తుత మధ్య ప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ శనివారం రోజు ప్రజా డిమాండ్ల పిటిషన్లను భిక్షాటనగా అభివర్ణించడం వివాదానికి దారి తీసింది. మధ్య ప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో వీరాంగ రాణి అవంతిబాయి లోధి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.ప్రజలు ప్రభుత్వం నుంచి అడుక్కోవడం అలవాటు చేసుకున్నారని చెప్పుకొచ్చారు.నాయకులు వచ్చిన వెంటనే వారికి వినతి ప్రతాలతో నిండిన బుట్టలను అందజేస్తారన్నారు.అలాగే వేదికపైకి పిలిచి దండలు వేసిన అనంతరమే వారి చేతుల్లో డిమాండ్ల లేఖను పెడతారని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వివరించారు.

సంస్కారవంతమైన సమాజం

అడగడానికి బదులుగా, ఇచ్చే మనస్తత్వాన్ని పెంచుకోండని చెప్పారు. ఇది సంతోషకరమైన జీవితానికి దారి తీస్తుందని.సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయ పడుతుందని వెల్లడించారు. ఉచితాలపై అధికంగా ఆధారపడడం వల్ల పని చేయాలనే ఆలోచన కూడా కోల్పోతారన్నారు. ఈ యాచకుల సైన్యం సమాజాన్ని బలోపేతం చేయడం లేదని.బలహీన పరుస్తుందని స్పష్టం చేశారు.అంతేకాకుండా ఉచిత వస్తువుల పట్ల ఆకర్షణ.మనం అమరవీరుల విలువలకు అనుగుణంగా జీవించినప్పుడే వారు నిజంగా గౌరవించ బడతారన్నారు.

Related Posts
జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన
జెనీవా సమావేశంలో పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్పందన

జెనీవాలో జరిగిన UN మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ జమ్మూ & కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం భారతదేశం తీవ్రంగా తప్పుబట్టింది. భారతదేశం ఈ ఆరోపణలకు దీటుగా Read more

శ్వేత విప్లవ పితామహుడిని స్మరించుకుంటూ జాతీయ పాల దినోత్సవం..
verghese kurien

ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారతదేశంలో నేషనల్ మిల్క్ డేను సెలబ్రేట్ చేయడం, పాలు మరియు పాల పరిశ్రమకు చేసిన అద్భుత కృషిని గుర్తించడానికి ప్రత్యేకమైన Read more

ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు : మహారాష్ట్ర
ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు మహారాష్ట్ర

ఔరంగజేబ్ సమాధిని జేసీబీతో తొలగింపు : మహారాష్ట్ర లో ఔరంగజేబ్ సమాధి తొలగించాలన్న డిమాండ్‌కు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శంభాజీనగర్ Read more

కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్
కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, దక్షిణ భారతంలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *