MAD:మ్యాడ్ స్క్వేర్ ట్రైల‌ర్ విడుదల

MAD:మ్యాడ్ స్క్వేర్ ట్రైల‌ర్ విడుదల

2023లో విడుదలై ఘనవిజయం సాధించిన వినోదాత్మక చిత్రం ‘మ్యాడ్’ కి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 28న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ట్రైలర్

మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూస్తే, మొదటి భాగం కన్నా మరింత ఫన్, కామెడీ, ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్ లో సాగే కథకు దర్శకుడు కళ్యాణ్ శంకర్ సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా మలిచారు.ముఖ్యంగా, నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు అదిరిపోయాయి.ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య సాగే హాస్యంతోపాటు క్లాస్‌మేట్స్, సీనియర్స్, టీచర్స్ మధ్య జరిగే హాస్యభరిత సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే అర్థ మవుతోంది.ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. క్లాస్‌రూమ్ ఫన్, హాస్యభరిత సన్నివేశాలు, అల్లరి అన్నీ కలిసి ఈ సినిమాను అదిరిపోయే కామెడీ ఎంటర్‌టైనర్‌గా మార్చాయి.

అంచనాలు

గత ఏడాది వచ్చిన ‘మ్యాడ్’ సినిమా కాలేజ్ కామెడీగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. అదే కోవలో ‘మ్యాడ్ స్క్వేర్‘ కూడా మరింత పెద్ద విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

భారీ క్రేజ్

ఈ నేపథ్యంలో “మ్యాడ్ 2″పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కాలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. గతంలో హ్యాపీ డేస్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జాతిరత్నాలు వంటి చిత్రాలు ఆకట్టుకున్నట్టు, 'మ్యాడ్ స్క్వేర్' కూడా మంచి స్పందన తెచ్చుకునేలా కనిపిస్తోంది.'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్ చూస్తే, సినిమా కచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.సినీ అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ నవ్వులు పూయించింది. మొదటి భాగంతో పోలిస్తే రెట్టింపు వినోదాన్ని మ్యాడ్ స్క్వేర్ లో చూడబోతున్నామని ట్రైలర్ తో మరోసారి రుజువైంది.ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి, ‘స్వాతి రెడ్డి’, ‘వచ్చార్రోయ్’ పాటలు చార్ట్‌బస్టర్‌ లుగా నిలిచాయి. ప్రముఖ ఛాయగ్రాహకుడు శామ్‌దత్ అద్భుత కెమెరా పనితనం, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ ప్రతిభ తోడై,వెండితెరపై భారీ వినోదాన్ని అందించడానికి మ్యాడ్ స్క్వేర్ సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ 2025, మార్చి 28న థియేటర్లలో అడుగు పెట్టనున్న మ్యాడ్ స్క్వేర్, ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచనుంది.

మ్యాడ్ స్క్వేర్

‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా వస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. 

Related Posts
‘మ్యాక్స్’ మూవీ రివ్యూ!
'మ్యాక్స్' మూవీ రివ్యూ!

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మరోసారి తన మాస్ ఇమేజ్‌ను తెరపై చూపించాడు. 'మ్యాక్స్' అనే ఈ యాక్షన్ డ్రామాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన Read more

Pushpa-2 first half report: పుష్ప-2 ఫస్ట్‌హాఫ్‌ రిపోర్టు వచ్చేసింది..
allu arjun sukumar

ప్రతిభాశాలి నటుడు అల్లు అర్జున్ మరియు ప్రతిభాశాలి దర్శకుడు సుకుమార్ కలిసి రూపొందిస్తున్న చిత్రం పుష్ప-2: దిరూల్ చిత్రం ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో ఈ Read more

ఊహించని న్యూస్..సాయి పల్లవి
అభిమానులకు ఊహించని న్యూస్..సాయి పల్లవి

సౌత్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ సాయి పల్లవి పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో వరుస హిట్లతో క్రేజ్ సంపాదించుకున్న Read more

కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి కామెంట్స్‌
rajamouli

రాజమౌళి - సూర్య పై ప్రశంసలు మరియు కంగువ ప్రీ రిలీజ్ వేడుక విశేషాలు తెలుగు సినిమాలకు సూర్య చేసిన సేవలు, అతని ప్రభావం గురించి దర్శకుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *