విజయవాడ : లేఔట్ క్రమబద్దీకరణ పథకం (LRS) నోటిఫికేషన్ జారీ అయిన జులై 26వ తేదీ నుంచి నిర్దేశించిన 90 రోజుల గడువులోగా ధరఖాస్తులు చేసుకోనట్లైతే… ఆ తర్వాత అనుమతించేది లేదని పురపాలక, పట్టణాభివృధ్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పోర్టల్ హెచ్ఎటిపిఎస్: ఆర్ఎస్జీటిసిపి. ఎపి. జిఓవి. ఇన్ ద్వారా ధరఖాస్తులు చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. 2025 జూన్ 30కి ముందు రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లే క్రమబద్దీకరించుకునే వీలుంది. వ్యక్తిగతంగా ప్లాట్ యజమానులు, కాలనీ సంక్షేమ సంఘాలు,డెలపర్లు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్క ప్లాట్ అయినా నిర్దేశించిన కటాఫ్ తేదీకి ముందు విక్రయించినా… లేఔట్ మొత్తం క్రమబద్దీకరణకు అర్హత సాధిస్తుంది. అమరావతి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలు, మాస్టర్న్ గల గ్రామ పంచాయితీల్లో నిబంధనలకు లోబడి లేఔట్లు క్రమబద్దీ కరించుకోవచ్చు అని సురేష్కుమార్ పేర్కొన్నారు. పీజుల్లోనూ రాయితీ… క్రమబద్దీకరణకు నిర్ణయించిన రుసుములు (ఫీజులు) ధరఖాస్తు చేసిన 45 రోజుల్లోగా చెల్లిస్తే ఫీజు మొత్తంలో 10% రాయితీ, 90 రోజుల్లోగా చెల్లిస్తే 5% రాయితీ వర్తిస్తుంది.

ప్రభుత్వ భూములు, చెరువులు, రహదారులకు కేటాయించిన భూములు, వివాదాస్పద స్థలాలు, వరద ముప్పు ప్రాంతాలు, గ్రీన్ బఫర్ జోన్లు, తీరప్రాంత నియంత్రణ మండలి (CRZ) పరిధిలో స్టాల్లు, లేఔట్లలో ఎల్ఆర్ఎస్ అనుమతించరు. క్రమబద్దీకరణ కింద వసూలు చేసిన ఫీజు మొత్తాలు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది’అని సురేష్కుమార్ వివరించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :