కన్నప్ప’నుంచి..‘సగమై..చెరిసగమై’ప్రేమ పాట విడుదల డైనమిక్ హీరో విష్ణు మంచు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఇప్పటికే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ‘శివా శివా శంకర’ పాట ఇటీవల విడుదలైన రెండో టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.విడుదల సమయం దగ్గర పడుతుండటంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.ఈ క్రమంలోనే సోమవారం ఓ అందమైన మెలోడీ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.‘సగమై.చెరిసగమై’అనే ఈ హృద్యమైన ప్రేమ పాటలో విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ అద్భుతంగా కనిపించారు.గాయకుడు రేవంత్, గాయనిమణి సాహితి చాగంటి ఆలపించిన ఈ గీతానికి స్టీఫెన్ దేవస్సీ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.శ్రీమణి అందించిన సాహిత్యం పాటను మరింత ఆకర్షణీయంగా మార్చింది.పాటను చూపించిన విధానం, ప్రభుదేవా, బృందా కొరియోగ్రఫీ చేసిన తీరు, హీరో-హీరోయిన్ కెమిస్ట్రీ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.శివ భక్తుడైన కన్నప్ప పురాణ గాథను ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించనున్నారు.కథాంశాన్ని పవర్‌ఫుల్‌గా మలచి గ్రాండ్ విజువల్ ట్రీట్ ఇవ్వాలని చిత్రబృందం కష్టపడుతోంది.ఇందులో విష్ణు మంచు కన్నప్పగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడిగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్రుడిగా, టాలెంటెడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పార్వతీ మాతగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లో మోహన్ బాబు, మోహన్‌లాల్, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమా టీజర్‌లు, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, సాహిత్యం, సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న ఈ చిత్రం, తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోం