Lok Sabha passes Waqf Amendment Bill

Waqf Bill : వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Waqf Bill: సుదీర్ఘ సంవాదాల తర్వాత వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం లోక్‌సభలో ఈ బిల్లుపై సుదీర్ఘ‌ చర్చ జరిగింది. 12 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చ అనంతరం, అర్ధరాత్రి తర్వాత స్పీకర్‌ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 282 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది దీనిని వ్యతిరేకించారు. అధికార, విపక్ష సభ్యుల వాద ప్రతివాదాలతో సభ దద్దరిల్లిపోయింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2.15 గం.లు దాటే వరకూ చర్చ, ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది.

Advertisements
 వక్ఫ్‌ సవరణ బిల్లుకు లోక్‌సభ

అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు

బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘ సమయం పాటు లోక్‌సభ భేటీ కొనసాగడం ఇదే మొదటిసారి. కాగా, ఈ బిల్లుకు ఎన్డీయే భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేన (షిండే) లోక్ జనశక్తి పార్టీ ( రామ్ విలాస్) మద్దతిచ్చారు. మరో వైపు విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి.

ఆమోదం కోసం వక్ఫ్‌ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు

తీవ్ర నిరసనను ప్రకటించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బిల్లు పేపర్లను చించివేశారు. చర్చ, ఆమోదం కోసం వక్ఫ్‌ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. అయితే.. వక్ఫ్ భూముల పరిరక్షణ, పరిపాలనను బలోపేతం చేసే లక్ష్యంగా ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు కేంద్రం ప్రకటించింది. అక్రమ ఆక్రమణలు, అవినీతిని నివారించేందుకు కొత్త నిబంధనలు, వక్ఫ్ బోర్డు అధికారాలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. వివాదాస్పద భూముల పరిష్కరానికి సమర్థవంతమైన విధానాలు ఈ బిల్లు సూచిస్తుందని తెలిపింది.

Related Posts
Vaishno Devi Temple: తుపాకీతో వైష్ణోదేవి ఆల‌యంలోకి ప్రవేశించిన మహిళ
Vaishno Devi Temple: తుపాకీతో వైష్ణోదేవి ఆలయంలో ప్రవేశించిన మహిళ.. భద్రతా విఫలం!

జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ పవిత్ర స్థలంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో ఓ Read more

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బీజేపీ అభ్యర్ధుల ప్రచారంలో పాల్గొని, ఆర్‌కే పురంలో ఓ భారీ సభను నిర్వహించారు. 11 ఏళ్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలనపై Read more

మతపరమైన పోస్టు: కాంగ్రెస్ ఎంపీపై కేసు
మతపరమైన పోస్టు కాంగ్రెస్ ఎంపీపై కేసు

గుజరాత్‌లోని జామ్నగర్‌లో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్గఢీపై, రెచ్చగొట్టే పాటతో ఎడిట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ Read more

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష సమావేశం
CM Revanth Reddy review meeting on local body elections

స్థానిక ఎన్నికలకు ముమ్మర కసరత్తు.. హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×