తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు జరపాలని ప్రతిపాదనలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 26న పలు పథకాల అమలు పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ఈనెల చివరినాటికి పలు కీలక పథకాల అమలు పూర్తిచేయాలని నిర్ణయించింది. పేదలకు ఇళ్ల పంపిణీ తదితర కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ పథకాల పూర్తి అమలు కారణంగా ఎన్నికలలో ప్రభావం చూపుతుందని స్థానిక నేతలు అంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తుంది. ఈ సమయంలో కొత్త పథకాల అమలు లేదా అనుమతులు ఇవ్వడం కుదరదు. ఈ కారణంగా కొన్ని కీలక పనులు నిలిచిపోవచ్చు. దీంతో ఎన్నికల షెడ్యూల్ విషయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ప్రభుత్వం పథకాల పూర్తి అమలు పూర్తికాకపోతే, ఎన్నికలను ఏప్రిల్ లేదా మేకు వాయిదా వేయవచ్చని సమాచారం. ఈ పరిస్థితి ఎదురైతే, అప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉంది. ఎన్నికల పర్యవసానాల దృష్ట్యా ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఎన్నికల వార్తలతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరుగుతోంది. ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రచారానికి సిద్ధమవుతుండగా, అధికార పార్టీ కూడా తమ విజయాన్ని సురక్షితం చేసుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది. రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.