ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌‌లకు రూ.20 కోట్ల వరకు రుణాలు..

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. దేశంలో పెట్టుబడులతో పాటు స్టార్టప్ లకు కేంద్రం ఊతమిచ్చింది. ఈసారి చిన్న తరహా, స్టార్టప్‌లపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి బడ్జెట్ లో వరాలు ప్రకటించింది. వారి కోసం ప్రత్యేక ఫండ్‌ ఇవ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌లు 20 కోట్ల వరకు రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వారికి ప్రత్యేక క్రెడిట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

image

చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్‌ఎంఈ రుణం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు కేంద్రం రుణాలు ఇస్తామని తెలిపింది. వీటితో పాటు డెయిరీ, ఫిషరీకి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. మరోవైపు అస్సాంలోని నామ్‌రూప్‌లో యూరియా ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం నిర్నయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి, వారి కాళ్ల మీద నిలబడేలా ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించింది.

తోలు పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి లభించనుంది. భారతదేశాన్ని టాయ్ హబ్‌గా మారుస్తామని కేంద్ర మంత్రి నిర్మలమ్మ చెప్పారు. బొమ్మల తయారీ కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేస్తామన్నారు. అతి పెద్ద లాజిస్టిక్‌ వ్యవస్థ పోస్టల్ శాఖ అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖను మార్చడానికి తాము సిద్ధమని చెప్పారు. దానిని దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్‌ వ్యవస్థ తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

Related Posts
రజనీకాంత్ మూవీ లో సెట్ లో జాయిన్ అయినా అమిర్ ఖాన్
amir khan kuli

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం కూలీ పైన సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో Read more

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా హోమ్ గార్డు అరెస్ట్
Female home guard arrested

వేములవాడ : సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న హోమ్ గార్డు వడ్ల అనూషను పోలీసులు అరెస్ట్ Read more

పది విఫలమైన కేజ్రీవాల్ హామీలు: బీజేపీ
పది విఫలమైన కేజ్రీవాల్ హామీలు: బీజేపీ

అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చి దశాబ్దం గడిచినా, విద్యుత్ ఛార్జీలను తగ్గించడం, శుద్ధమైన నీటిని అందించడం, వైద్యం మరియు విద్యా రంగంలో మెరుగుదల సాధించడం, మరియు యమునా Read more

సూసైడ్ లెటర్ చెల్లుబాటు కాదు, ఆధారాలు కావాలి: సుప్రీంకోర్టు

ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా తేలిన వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. నిందితుడు మృతురాలిని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, తద్వారా ఆమె ఆత్మహత్యకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *