US-Israel Iran War LIVE: అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్‌పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ మరణంపై వస్తున్న వార్తలు, ఇరాన్ ప్రతిఘాత చర్యలు, గల్ఫ్ దేశాల తాజా పరిణామాలు, ట్రంప్ హెచ్చరికలు మరియు అంతర్జాతీయ సమాజం స్పందనలతో మధ్యప్రాచ్యం పరిస్థితి తీవ్రంగా మారుతోంది. ఈ సంక్షోభానికి సంబంధించిన నిమిషానికో అప్డేట్ను మీకు అందించే ప్రత్యక్ష వార్తలు ఇక్కడ.
LIVE News & Updates:
●02:12 PM (IST) • Mar 02
ఇరాన్‌పై ఆపరేషన్ కొనసాగింపు: అమెరికా, ఇజ్రాయెల్ కీలక ప్రకటనలు
- తమ లక్ష్యాలు సాధించే వరకు ఇరాన్‌పై ఆపరేషన్‌ను కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
- ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని పూర్తి శక్తితో అమలు చేస్తామని ప్రకటించారు.
- ఈ విషయంపై తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్’లో వీడియో సందేశం విడుదల చేశారు.
- ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
- ఇరాన్‌పై నిర్ణయాత్మక దెబ్బ కొడతామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.
- టెహ్రాన్‌పై దాడులను మరింత ముమ్మరం చేయాలని తమ సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
●02:07 PM (IST) • Mar 02
శ్రీనగర్‌లో ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు
- జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
- ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.
- ఆందోళనలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
- కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులపై లాఠీఛార్జ్ చేసినట్టు సమాచారం.
- కశ్మీర్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.
- ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.
- పాఠశాలలు మూసివేయడంతో పాటు పరీక్షలను వాయిదా వేశారు.
●02:06 PM (IST) • Mar 02
కువైట్‌లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానాలు
- కువైట్‌లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానాలు
- ఇవాళ ఉదయం యుద్ధ విమానాలు కుప్పకూలినట్టు కువైట్ ప్రకటన
- గాయాలతో బయటపడ్డ పైలట్లు
- యుద్ధ విమానాల నష్టంపై యూఎస్ మౌనం..
- తామే కూల్చేశామని ప్రకటించిన ఇరాన్..
●01:44 PM (IST) • Mar 02
మోదీ కీలక వ్యాఖ్యలు
- పశ్చిమాసియా యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
- పరిస్థితి చాలా ఆందోళనకరం గా ఉంది
- శాంతి స్థాపన, చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం – మోదీ
- భారత్ శాంతి కోసం కృషి చేస్తుంది
- గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి అన్ని చర్యలు – మోదీ
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.