Liquor shops lottery today in AP

ఏపీలో నేడే మద్యం షాపుల కోసం లాటరీ

అమరావతి: ఏపీలో నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా, 89,882 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.1797.64కోట్ల ఆదాయం వచ్చింది.

Advertisements

అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రావడంతో వాటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని 113 మద్యం దుకాణాలకు అత్యధికంగా 5,764 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు లాటరీ పధ్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 15న (రేపు) ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగించనున్నారు. దీంతో 16వ తేదీ నుండి రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది.

Related Posts
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి: విద్యుత్ పరిమితులు విధించిన ప్రభుత్వం
UkraineRussiaConflictWar

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెంస్కీ ఇటీవల ఒక ప్రకటనలో, రష్యా 120 మిసైళ్ళు మరియు సుమారు 100 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. ఈ దాడులు కీవ్‌తో పాటు Read more

షర్మిలపై జగన్ కీలక వ్యాఖ్యలు
షర్మిలతో విభేదాలు తీవ్రతరం – జగన్ కీలక ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా Read more

అయోధ్య రామాల‌యం దేశ ప్ర‌జ‌ల‌కు ప్రేర‌ణ‌ : ప్రధాని
Ayodhya Ram Temple is an inspiration to the people of the country.. Prime Minister

న్యూఢిల్లీ: అయోధ్య‌లో కొత్త నిర్మించిన రామ మందిరంలో రామ్‌ల‌ల్లాను ప్ర‌తిష్టాప‌న చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ దేశ ప్ర‌జ‌ల‌కు Read more

2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more