Let's work together.. China call to India

కలిసి పనిచేద్దాం : భారత్‌కు చైనా పిలుపు

బీజింగ్‌ : నిన్న మొన్నటి వరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన చైనా ఇప్పుడు స్వరం మార్చింది. ట్రంప్ సుంకాల పెంపుతో చిక్కుల్లో పడే ఛాన్స్ ఉండటంతో భారత్‌వైపు స్నేహ హస్తం చాచింది. సహకరించుకుందాం రమ్మంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పిలుపునిచ్చారు. ఒకరికొకరు అండగా రెండు దేశాలూ అభివృద్ధి చెందాలి. అదే ఉమ్మడి లక్ష్యం కావాలి. పోరాడుతూ కూర్చోవడం కంటే సహకారం అందించుకోవడం మేలు అని ఆయన పేర్కొన్నారు. ఆసియాలోనే కీలకమైన తమ రెండు దేశాల మధ్య సహకారం అత్యంత ముఖ్యమన్నారు. దీనిని ఆయన సమన్వయంతో చేసే నృత్యంతో పోల్చారు.

Advertisements
కలిసి పనిచేద్దాం భారత్‌కు చైనా

చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదు

ఢిల్లీ, బీజింగ్‌ మధ్య మెరుగైన సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు కూడా ప్రయోజనమన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి.. అంతర్జాతీయ వేదికలపై గ్లోబల్‌ సౌత్‌ (పేద దేశాల) స్థానాన్ని శక్తిమంతం చేస్తుందన్నారు. ఇరుదేశాల మధ్య వివాదాలను దౌత్యమార్గంలో పరిష్కరించుకొంటామని.. సమష్టి ప్రయోజనాలను కాపాడుకోవడానికి సహకారం అవసరమని వాంగ్‌ అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా పరిష్కారం కానీ సమస్యే లేదు. అదే సమయంలో సహకారంతో చేరుకోలేని లక్ష్యాలు లేవు అని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల భేటీలో భారత మంత్రి జైశంకర్‌తో చైనా మంత్రి వాంగ్‌ యీ భేటీ అయ్యారు.

ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గి పాత స్థితికి

ఆ తర్వాత కొన్ని వారాల్లోనే ఈ ప్రకటనలు వెలువడ్డాయి. వాస్తవానికి 2020లో గల్వాన్‌ ఘర్షణ తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు అట్టడుగుస్థాయికి పడిపోయాయి. ఆ తర్వాత పలు విడతలుగా ఇరుదేశాలకు చెందిన దౌత్యవేత్తలు, సైనికాధికారులు చర్చలు జరిపారు. 2024లో ప్రధాని మోడీ-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా కజాన్‌లో భేటీ అయ్యారు. ఆ తర్వాతనే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నచోట్ల నుంచి ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గి పాత స్థితికి చేరుకొన్నాయి. మరోవైపు ఈ ఏడాది చైనా షాంఘై సహకార సంస్థ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. భారత ప్రధాని మోడీ అందులో పాల్గొనడం అత్యంత కీలకంగా మారనుంది.

Related Posts
Buggana Rajendranath: కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన బుగ్గన
Buggana Rajendranath: కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన బుగ్గన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన పేర్కొన్న విధంగా, అధికారంలోకి వచ్చి ఏడాదైనా Read more

ఎస్సిఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా రమేష్
ఎస్సిఆర్ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా రమేష్

సికింద్రాబాద్లోని రైల్ నిలయం వద్ద దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా (పిసిసిఎం) ఎన్ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. రమేష్ ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ Read more

కమలా హారిస్ ట్రంప్ పై చేసిన విమర్శలు
harris

అమెరికాలో రాజకీయాలలో తరచుగా వ్యక్తుల శారీరక స్థితి ప్రముఖంగా చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా అధ్యక్ష పదవి పోటీలో, శారీరక ఆరోగ్యం ఒక కీలక అంశం. డెమోక్రటిక్ పార్టీ Read more

Pakistan Army : పాక్ ఆర్మీలో పెరుగుతున్న అశాంతి – ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు
Pakistan Army పాక్ ఆర్మీలో పెరుగుతున్న అశాంతి – ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు

Pakistan Army : పాక్ ఆర్మీలో పెరుగుతున్న అశాంతి – ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తిరుగుబాటు పాకిస్తాన్‌లో రాజకీయ అస్థిరత పెరిగిన సమయంలో, ఇప్పుడు ఆర్మీలోనే Read more

Advertisements
×