Legal Awareness and Crime Prevention:ఇటీవల కాలంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, డ్రగ్స్వా డకం పెరిగింది.
గంజాయి మత్తుకు యువత బానిసలు అవుతున్నారు. జల్సాల కోసం మరికొందరు నేరాలకు పాల్పడుతున్నారు.
మరికొన్ని సందర్భాల్లో చిన్నచిన్న ఘర్షణలతో రక్త సంబంధీకులను హత్య చేస్తున్నారు. అనుమానం పెరిగి భర్యాభర్తలు ఒకరిని మరొకరు కడతేర్చుతున్నారు.
వావివరుసలు మరిచి మరికొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఇంజనీరింగ్, మెడికల్ వంటి ఉన్నత చదువులు అభ్యసిస్తున్న కొందరు చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు.
కొందరు ఏదో ఒక నేరాన్ని చేసి కటకటాల పాలౌతున్నారు. హైదరాబాద్లో ఇటీవల కొందరు యువతులు (young women) తాము కిడ్నాప్కు గురయ్యామని
తప్పుడు సమాచారం ఇచ్చి చివరకు పోలీసులు ముందు తలొంచుకుని నిలబడుతున్నారు.
ఇలాంటి ఘటనల వల్ల నిజంగా కిడ్నాప్ (Kidnapping) కు గురైనా వాస్తవమా కాదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
దీనివల్ల నిజమైన బాధితులకు సకాలంలో సహాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్లో అత్యాచారం అనంతరం హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో ఇదే జరిగింది. తప్పుడు ఫిర్యాదులు ఎక్కువ కావడంతో దిశ వ్యవహారం పోలీసు దృష్టికి వచ్చినా సకాలంలో స్పందించకపోవడంతో నష్టం జరిగిపోయింది.
విద్యావంతులు సైతం కొన్ని సందర్భాల్లో నేరాలు చేసి పోలీసులకు చిక్కుతున్నారు.
నేరం చేసిన వారిని శిక్షించడానికి అనేక సెక్షన్లు ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలకు వీటిపై కనీస అవగాహన ఉండటం లేదు. ఇలాంటి నేరాలు
ముందుగా పథకం వేసుకుని చేసినవి కావు. అప్పటికప్పుడు తమను తాము అదుపు చేసుకోలేక చేస్తున్న నేరాలు.
చట్టాలను ప్రజల్లో అవగాహన కల్పించాలి.
ప్రేమించిన యువతి ప్రేమను తిరస్కరించడంతో యాసిడ్ పోయడం, హత్యకు ప్రయత్నించడం కూడా భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆలోచించ కుండా చేసే నేరాలు.
ఇలాంటి నేరాలు తగ్గుముఖం పట్టాలంటే ఇలాంటి వాటికి చెందినచట్టాలను ప్రజల్లో అవగాహన కల్పించాలి. మైనర్బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు పడతాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి.

ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై అతితక్కువ సమయంలో చట్టరీత్యా చర్యలు ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు.
నల్గొండ జిల్లాలో సీరియల్గా యువతులను హతమార్చిన శ్రీనివాస్ పై కేసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అన్ని సాక్ష్యాలు ఉన్నా అతని నేరాలకు సంబంధించి తుది తీర్పు వెలువడలేదు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన హైదరాబాద్లోని సైదాబాద్ పరిధిలో ఉన్న సింగరేణి కాలనీలోని చైత్ర అనే బాలికపై రాజు హత్యాచార ఉదంతం ఒక ఉదాహరణ.
రాజును ఎన్ కౌంటర్ చేయాలనే నినాదం మారుమ్రోగింది.
కారణం ప్రజలకు చట్టాలపై నమ్మకం లేకపోవడమే. నేరం చేస్తే తప్పించుకునే వీలులేదని ఇలాంటి నేరస్తులకు అవగాహనంకల్పించాలి.
నేరం చేసిన తరువాత పోలీసులు పరుగులు తీసి నేరస్తులను పట్టుకోవడం వల్ల, వారినిఎన్కౌంటర్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు.
నేరం జరగకుండా నిరోధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఎయిడ్స్ విషయంలోను, కరోనా వ్యాప్తి కట్టడి సమయంలో విస్తృత
ప్రచారాన్ని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు.
దీనికి తగిన ఫలితం కూడా కనిపించింది. అదేవిధంగా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని. యువతులు, మహిళలపై అత్యాచారాలు చేసే వారిని నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇలాంటి నేరాలు
చేస్తే శిక్షలు ఏ విధంగా ఉన్నాయన్న విషయంపై ప్రచారం అవసరం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్యాచరణను రూపొందించాలి
దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్యాచరణను రూపొందించాలి. సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సెలబ్రిటీల సహాయం తో ప్రచారం కొనసాగించాలి. అదేవిధంగా హైస్కూలు విద్యలో నేరాలు,
చట్టాలు, శిక్షలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందించే తరగతులు నిర్వహించాలి. గతంలో మోరల్ క్లాసుల పేరుతో నీతివ్యాక్యాలు బోధించే వారు. ఆ తరువాత క్రమంగా ఈ తరగతులు నిలిచిపోయాయి.
ప్రస్తుతం కేవలం పాఠ్యాంశాలు మినహా విద్యార్థులకు ఇతర
అంశాలపై ఎటువంటి అవగాహన ఉండటం లేదు. నేరం చేసిన తరువాత పట్టుకుని చట్టానికి అప్పగించి శిక్షించడం కంటే ముందే నేరాన్ని నివారిస్తే ఇటు బాధితులకు, అటు నేరాలకు పాల్పడేనిందితులకు ప్రయోజనం ఉంటుంది.

అదేవిధంగా నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలి. పోలీసుస్టేషన్లలో ఎస్ఐ. ఎఎస్ఐ. సిఐ స్థాయి అధికారులతో బస్తీలో సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజల్లో చైతన్యం కల్పించాలి.
నేరాలు చేసేవారిని కట్టడి చేయడం, నేరాలు జరిగే సమయంలో ప్రజలు వాటిని ఎలా ఎదుర్కొవాలో అన్న విషయాలను వారికి వివరించాలి.
వివిధ నేరాలకు ఎలాంటి శిక్షలు పడతాయో పోలీసులు స్వయంగా ప్రజలకు వివరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సమావేశాలు ముఖ్యంగా నిరక్షరాస్యత అధికంగా ఉన్న బస్తీలు నిర్వహించాలి.
హోంశాఖ ఉత్తర్వులు జారీ
ప్రతి నెలా క్రైం మీటింగ్లు ఉన్నట్లు ప్రతినెలా బస్తీ సమావేశాలు తప్పనిసరిహోంశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ చేయాలి.
అదేవిధంగా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బృందాలుగా ఏర్పడి తమ ప్రాంతాల్లో నెలకు ఒకసారి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి నేరాలపైనా కాకుండా చదువుకుంటే కలిగే ప్రయోజనాల కోసం కూడా బస్తీ వాసులకు వివరించాలి.
ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇవ్వడం, అవసరమైన నిధులు జారీ చేయడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇటువంటి సమావేశాలు నిర్వహించినప్పుడు హైకోర్టు, జిల్లా కోర్టుల్లో క్రిమినల్ కేసులను వాదించే న్యాయవాదులను ముఖ్యఅతిధులుగా పిలిచి వారిచేత ఇండియన్ పీనల్ కోడ్ గురించివివరించాలి. ఒక ఉద్యమంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే చాలా వరకు నేరాలను కట్టడి చేసే అవకాశం లభిస్తుంది.
Read also: hindi.vaartha.com
Read also: Freebie Politics in India:హద్దులు దాటిన ఉచితాలు సరికాదు