हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

Latest Telugu news: Left Side Sleeping – నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ వైపే ఎందుకు తిరిగి ప‌డుకోవాలో తెలుసా..

Sudha
Latest Telugu news: Left Side Sleeping – నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ వైపే ఎందుకు తిరిగి ప‌డుకోవాలో తెలుసా..

రాత్రి పూట నిద్రించేట‌ప్పుడు చాలా మంది వివిధ ర‌కాల భంగిమ‌ల్లో నిద్రిస్తుంటారు. కొంద‌రు కేవ‌లం వెల్ల‌కిలా మాత్ర‌మే ప‌డుకుంటారు. కొంద‌రు బోర్లా ప‌డుకుంటారు. కొంద‌రు మాత్రం ఏదైనా ఒక వైపు తిరిగి మాత్ర‌మే నిద్రిస్తారు. అయితే రాత్రి పూట కేవ‌లం ఎడ‌మ వైపు తిరిగి (Left Side Sleeping)మాత్ర‌మే నిద్రించాల‌ని, అలా నిద్రిస్తేనే మ‌న‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు (Health benefits)క‌లుగుతాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఆయుర్వేద కూడా ఇదే విష‌యాన్ని సూచిస్తుంటుంది. రాత్రి పూట ఎడ‌మ వైపు తిరిగి (Left Side Sleeping)మాత్ర‌మే నిద్రించాలా..? ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Left Side Sleeping - నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ వైపే ఎందుకు  తిరిగి ప‌డుకోవాలో  తెలుసా..
Left Side Sleeping – నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ వైపే ఎందుకు తిరిగి ప‌డుకోవాలో తెలుసా..

జీర్ణ‌క్రియ మ‌రింత వేగం

ఎడ‌మ వైపు తిరిగి నిద్రిస్తే (Left Side Sleeping)జీర్ణాశ‌యం, క్లోమ‌గ్రంథి అదే వైపు ఉంటాయి క‌నుక గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి వ‌ల్ల జీర్ణ‌క్రియ మ‌రింత వేగంగా కొన‌సాగుతుంది. దీని వ‌ల్ల ఆహారం సుల‌భంగా జీర్ణాశ‌యం నుంచి పేగుల్లోకి క‌దులుతుంది. దీంతో అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, గుండెల్లో మంట వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గ్యాస్ట్రో ఎసోఫేజియ‌ల్ రిఫ్ల‌క్స్ డిసీజ్అనే స‌మ‌స్య ఉన్న‌వారు కచ్చితంగా ఎడ‌మ వైపు తిరిగి నిద్రించాల‌ని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే దీని వ‌ల్ల ఎంత‌గానో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణాశ‌యం ఆహార‌నాళం కింద ఉంటుంది. దీని వ‌ల్ల జీర్ణాశయంలోని ఆమ్లాలు తిరిగి ఆహారనాళంలోకి రాకుండా ఉంటాయి. దీంతో నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. మాటి మాటికీ ఆహారం వ‌ల్ల త్రేన్పులు రాకుండా ఉంటాయి.

లివ‌ర్‌పై ప‌డే భారం త‌గ్గుతుంది.

మ‌న శ‌రీరంలోని అతిపెద్ద ర‌క్త‌నాళం అయిన అరోటా గుండెకు ఎడ‌మ వైపు ఉంటుంది. క‌నుక ఎడ‌మ వైపు తిరిగి నిద్రిస్తే గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి వ‌ల్ల శ‌రీరానికి ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో గుండెపై ప‌డే భారం త‌గ్గుతుంది. అలాగే లింఫ్ వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేస్తుంది. శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు ఎడ‌మ వైపు తిరిగి నిద్రించాల‌ని వైద్యులు సూచిస్తుంటారు. దీని వ‌ల్ల గ‌ర్భంలో ఉన్న శిశువు భంగిమ స‌రిగ్గా ఉంటుంది. శిశువుకు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. లివ‌ర్‌పై ప‌డే భారం త‌గ్గుతుంది. తీవ్ర‌మైన వెన్ను నొప్పి స‌మ‌స్య ఉన్న‌వారు ఎడ‌మ వైపు తిరిగి నిద్రిస్తే వెన్నెముక‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డి వెన్ను నొప్పి త‌గ్గుతుంది.

Left Side Sleeping - నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ వైపే ఎందుకు  తిరిగి ప‌డుకోవాలో  తెలుసా..
Left Side Sleeping – నిద్రించేట‌ప్పుడు ఎడ‌మ వైపే ఎందుకు తిరిగి ప‌డుకోవాలో తెలుసా..

గుండె ఆరోగ్యం కోసం

అయితే ఎడ‌మ వైపు తిరిగి మాత్ర‌మే నిద్రించాలా.. కుడి వైపు తిరిగి నిద్రించ‌కూడ‌దా.. మాకు కుడివైపు మాత్ర‌మే బాగా అల‌వాటు ఉంది అనుకునేవారు త‌మ సౌక‌ర్యానికి అనుగుణంగా నిద్రించ‌వ‌చ్చు. కుడి వైపు నిద్రించ‌డం వ‌ల్ల ఎలాంటి హాని జ‌ర‌గ‌దు. గుండె ఆరోగ్యం కోసం, గ‌ర్భిణీలు ఎడ‌మ వైపు తిరిగి నిద్రిస్తేనే మంచిద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంద‌ర్భాల్లో సౌక‌ర్యం క‌న్నా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మ‌ని వారు అంటున్నారు. ఇక కుడి వైపు నిద్రించ‌డం అల‌వాటు అయిన వారు అంత త్వ‌ర‌గా ఎడ‌మ వైపును మార్చుకోలేరు. కానీ అలాంటి వారు కొన్ని రోజులు క‌ష్ట‌ప‌డితే ఎడ‌మ వైపు తిరిగి నిద్రించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. క‌నుక ఎడ‌మ వైపు తిరిగి నిద్రిస్తే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వచ్చు.

ఎడమ వైపు పడుకోవడం మీకు మంచిదా?

కుడి వైపు పడుకోవాలా లేదా ఎడమ వైపు పడుకోవాలా అనేది మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీలు లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఉన్నవారికి ఎడమ వైపు పడుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పరిస్థితులు ఉన్నవారు తమ ఎడమ వైపు పడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

అనారోగ్యకరమైన నిద్ర భంగిమ ఏది?

మీ ముందువైపు తిరిగి పడుకోవడం అనారోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది శ్వాసను నిరోధిస్తుంది మరియు వెన్నెముక యొక్క క్రమరహిత వక్రతకు కారణమవుతుంది. ఈ స్థితిలో నిద్రపోతున్నప్పుడు తల ఒక వైపుకు తిరగడం అటువంటి వక్రతకు మరొక కారణం. ఇవన్నీ వెన్నునొప్పితో పాటు మెడ కండరాలలో మంట మరియు నొప్పికి దారితీస్తాయి.

ఆడవాళ్ళు ఒక కాలు పైకి పెట్టి ఎందుకు నిద్రపోతారు?

ఒక ​​కాలు పైకి వంచి నిద్రపోవడం ఒక సాధారణ భంగిమ, మరియు మహిళలు సహా ప్రజలు దీనిని స్వీకరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో స్థిరత్వాన్ని కోరుకోవడం, ఉష్ణోగ్రత నియంత్రణను మెరుగుపరచడం మరియు వివిధ పరిస్థితుల నుండి అసౌకర్యాన్ని తగ్గించడం వంటివి ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-pista-health-benefits-weight-loss/health/537220/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870