దేశానికి అత్యుత్తమ లెఫ్టార్మ్ స్పిన్నర్లలో ఒకరైన ముంబై క్రికెట్ దిగ్గజం పద్మాకర్ శివాల్కర్ (84) మృతి చెందారు. రెండు దశాబ్దాలకు పైగా ముంబై జట్టును ప్రాతినిధ్యం వహించిన ఆయన, అంతర్జాతీయ స్థాయికి ఎదగలేకపోయినా, భారత దేశీయ క్రికెట్‌లో ఒక మహా ప్రస్థానాన్ని నిర్మించారు.
అత్యుత్తమ స్పిన్నర్
శివాల్కర్ 1961/62 సీజన్‌లో 21 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ప్రవేశించారు. అయితే, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మాత్రం ఆయనకు దక్కలేదు. అదే సమయంలో బిషన్ సింగ్ బేడీ భారత జట్టులో ప్రధాన లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా కొనసాగడంతో శివాల్కర్ జాతీయ స్థాయికి చేరలేకపోయారు. అయినప్పటికీ, ముంబై జట్టుకు ఒంటిచేత్తో ఎన్నో విజయాలను అందించి, దేశీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
రంజీ ట్రోఫీ
పద్మాకర్ శివాల్కర్ రంజీ ట్రోఫీలో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించారు. 1972/73 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగులకు 8 వికెట్లు, 18 పరుగులకు 5 వికెట్లు తీసి ముంబై జట్టుకు 15వ టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించారు. 1987/88 సీజన్ వరకు తన కెరియర్‌ను కొనసాగించిన శివాల్కర్, మొత్తం 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 589 వికెట్లు తీశారు. ఇందులో 42 సార్లు 5 వికెట్లు, 13 సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు.

గవాస్కర్ నివాళి
శివాల్కర్ మృతికి మాజీ భారత కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంతాపం తెలిపారు. ఇటీవల ముంబై క్రికెట్ దిగ్గజమైన మిలింద్, పద్మాకర్ వంటి వారిని కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. తన పుస్తకం ఐడల్స్లో శివాల్కర్‌ను ఒక ఆదర్శ క్రికెటర్‌గా అభివర్ణించిన గవాస్కర్, ఆయన దేశీయ క్రికెట్‌లో చూపించిన ప్రతిభకు ఘనంగా నివాళి అర్పించారు.
అచీవ్‌మెంట్ అవార్డు
శివాల్కర్ 2016లో సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. దేశీయ క్రికెట్‌లో తన అద్భుత ప్రదర్శనతో ముంబై జట్టును ఎన్నో విజయాల బాటలో నడిపించిన ఈ లెజెండరీ స్పిన్నర్ ఇక లేరు. అయితే, ఆయన క్రికెట్‌లో సాధించిన విజయాలు, దేశీయ క్రికెట్‌లో చూపిన అద్భుత ప్రతిభ ఎప్పటికీ చిరస్మరణీయంగానే నిలిచిపోతాయి.
కెరియర్
శివాల్కర్ 1961/62 సీజన్‌లో 21 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ కెరియర్ ప్రారంభించారు. అలా 47 ఏళ్ల వరకు అంటే 1987/88 సీజన్ వరకు ముంబైకి ఆడారు. మొత్తం 124 మ్యాచ్‌లు ఆడి 589 వికెట్లు పడగొట్టారు. 42 సార్లు 5 వికెట్లు, 13 సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు.