Lawyer dies of heart attack in Telangana High Court

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో- న్యాయవాది మృతి

ఓ కేసులో వాదనలు వినిపిస్తుండగా కుప్పకూలిన న్యాయవాది వేణుగోపాల్

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాది వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూప్పకూలారు. గమనించిన తోటి న్యాయవాదులు వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Advertisements
image

రెగ్యులర్‌ పిటిషన్లను వాయిదా

అయితే అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్‌ ఓవర్‌ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్‌ పిటిషన్లను వాయిదా వేశారు. సీనియర్ న్యాయవాది మృతితో తోటి లాయర్లు ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. ఇటీవల గుండెపోటు.. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వృద్ధులకే కాదు నడివయస్కులకు, యువతతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు. కూర్చున్నోళ్లు కూర్చుకున్నట్టుగానే.. నిలబడి ఉంటే అక్కడే.. డ్యాన్స్ చేస్తూ చేస్తూనే.. ఇలా ఎక్కడివాళ్లు అక్కడే.. క్షణాల్లో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేస్తున్నారు. అప్పటివరకు ఎంతో యాక్టివ్‌గా ఉండి.. ఉన్నట్టుండి ప్రాణాలు వదిలేస్తుండటం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.

Related Posts
ఇండోర్‌లోనే ట్రంప్ ప్రమాణం
Trump inauguration swearing in to be moved indoors due to cold

న్యూయార్క్‌ : ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం Read more

కేజ్రీవాల్ కారుపై దాడి!
కేజ్రీవాల్ కారుపై దాడి!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని కాన్వాయ్‌పై దాడి జరిగిందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ Read more

పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..
పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన Read more

ఢిల్లీ బొమ్మలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే
ఢిల్లీ బొమ్మలపై .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. ఈ శకటంలో ఏటికొప్పాక బొమ్మలు ఉన్న విషయం డిప్యూటీ సీఎం Read more

×