పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్

పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను రూ.లక్షల్లో డిమాండ్‌ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్హాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపి అనుకూల వ్యక్తిగా, జగన్ వీరాభిమానిగా బోరుగడ్డ అనిల్ కు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కల్యాణ్ వంటి నేతలను కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా సోషల్ మీడియా లో ప్రచారం చేసుకునేవాడు. తన అనుయాయులతో కలిసి రోడ్లపై నానా హంగామా సృష్టించేవాడు. అనిల్‌పై గతంలో పట్టాభిపురం, అరండల్‌పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఫోన్‌ చేసి జగన్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు గురిచేశాడు.

Related Posts
మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర ప్రమాదం
7 Kumbh returnees killed af

జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడు మంది తెలుగు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహాకుంభమేళా ముగించుకొని తిరిగొస్తుండగా, Read more

బాలకృష్ణ నిర్మాత ఆసక్తికర పోస్టు
nagavamshi post

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్‌’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. Read more

విద్యకు రూ.2,506 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్
బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల Read more

రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
Minister strong warning to registration department employees

తెలంగాణ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి సమస్యపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా, ఉద్యోగులు Read more