हिन्दी | Epaper

Vishnu Vinyasa Movie: కోతి బొమ్మతో స్టేజ్‌పై శ్రీవిష్ణు.. అసలు కథేంటంటే?

Anusha
Vishnu Vinyasa Movie: కోతి బొమ్మతో స్టేజ్‌పై శ్రీవిష్ణు.. అసలు కథేంటంటే?

Vishnu Vinyasa Movie: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు. ఆయన నటించిన తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’. ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీవిష్ణు తన స్టైల్‌లో సరదా కామెంట్స్‌తో ఆకట్టుకున్నారు.

Read Also: Srinivasa Mangapuram Movie: వైరల్ అవుతున్న అజయ్ భూపతి పోస్ట్

చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ నిర్మాతలు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అందుకే సినిమా ఎంతో వినోదాత్మకంగా వచ్చిందని చెప్పారు. హీరోయిన్ నయన్ సారిక అద్భుతంగా నటించిందని, ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపు తెస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే దర్శకుడు మారుతీ రావు ఎంతో కూల్‌గా పనిచేసే వ్యక్తి అని పేర్కొన్నారు. ఫస్టాఫ్ యూత్‌కు, సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని, చివరికి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అనుభూతి ఇస్తుందని శ్రీవిష్ణు నమ్మకం వ్యక్తం చేశారు.

“గ్రహస్థితి బాగోలేదన్నారు”.. శ్రీవిష్ణు మాస్ కామెడీ!

అయితే ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవిష్ణు చేతిలో కనిపించిన కోతి బొమ్మే ప్రధాన ఆకర్షణగా మారింది. కోతి బొమ్మను పట్టుకుని స్టేజ్‌పైకి రావడంతో అందరి దృష్టి ఆయనవైపు మళ్లింది. దాని గురించి ప్రశ్నించగా, “ఈ రోజు నా గ్రహస్థితి బాగోలేదని జ్యోతిష్యులు చెప్పారు. అందుకే ఓ కోతి పిల్ల పక్కన ఉంటే మంచిదన్నారు. నిజమైన కోతి అయితే కరుస్తుందేమో అనిపించి ఈ బొమ్మ తీసుకొచ్చాను” అంటూ నవ్వులు పూయించారు. తన సినిమాలో కూడా జాతకాలను నమ్మే వ్యక్తిగా నటిస్తున్నానని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కోతి బొమ్మతో స్టేజ్‌పై శ్రీవిష్ణు.. అసలు కథేంటంటే?

కోతి బొమ్మతో స్టేజ్‌పై శ్రీవిష్ణు.. అసలు కథేంటంటే?

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా

హైదరాబాద్​లో పలుచోట్ల చిరుజల్లులు

హైదరాబాద్​లో పలుచోట్ల చిరుజల్లులు

లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జ్యుడీషియల్ కస్టడీ

లంచం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు జ్యుడీషియల్ కస్టడీ

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌కు కొత్త కళ.. ఉగాదికి ప్రారంభం

మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌కు కొత్త కళ.. ఉగాదికి ప్రారంభం

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న బేబీ మంకీ స్టార్ ‘పంచ్’ కు పెరుగుతున్న ఆదరణ..

ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి టోల్ ఫీజు రిఫండ్!

ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి టోల్ ఫీజు రిఫండ్!

ఆహార మార్పులతో 70% ఆరోగ్య సమస్యలకు చెక్

ఆహార మార్పులతో 70% ఆరోగ్య సమస్యలకు చెక్

మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు

మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు

మార్నింగ్ క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు !!

మార్నింగ్ క్యారెట్ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు !!

📢 For Advertisement Booking: 98481 12870