Bihar Politics: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్తున్నట్లు నితీశ్ కుమార్ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 సీట్లకు పైగా స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షమైన జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలోనూ, లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్) 19 స్థానాలతో మూడో స్థానంలోనూ నిలిచాయి.
Read Also: Maharashtra: రాజ్యసభ బరిలో శరద్ పవార్.. ఎంవీఏ ఉమ్మడి అభ్యర్థిగా ఎంపిక!

సామ్రాట్ వర్సెస్ నిత్యానంద్
నితీశ్ రాజీనామా నిర్ణయంతో ఇప్పుడు అందరి దృష్టి “తదుపరి ముఖ్యమంత్రి ఎవరు?” అనే ప్రశ్నపైనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీహార్‌ను పాలించిన నితీశ్ వారసుడిగా పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ ముఖ్యమంత్రి పీఠం రేసులో ప్రస్తుత డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా చేసి పార్టీ బలోపేతంలో కీలకపాత్ర పోషించారు. అయితే ఎవరికి సీఎం పదవి ఇవ్వాలనే దానిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ కసరత్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: