మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని (Jadcherla) ఒక గురుకులంలో విద్యార్థుల భద్రత పైన మళ్లీ ప్రశ్నలు తలెత్తించే ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై మహిళా వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన బాధ్యతగల గురుకుల సిబ్బంది నుంచే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read also: AP :కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు

Sexual harassment of a tenth grade student
విద్యార్థినిపై శారీరక, లైంగిక వేధింపులు
పాఠశాలలో ఇటీవల నిర్వహించిన షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం ధైర్యాన్ని ఇచ్చిన విద్యార్థిని, తనపై జరుగుతున్న వేధింపులను బయటకు చెప్పేందుకు ముందుకొచ్చింది. దీంతో వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి గత కొన్ని నెలలుగా నైట్ డ్యూటీల సమయంలో విద్యార్థినిపై శారీరక, లైంగిక వేధింపులు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటపడకుండా బాధితురాలినీ, ఆమె తల్లిదండ్రులనూ ప్రిన్సిపాల్ రజిని రాగమాల బెదిరించినట్లు కూడా దర్యాప్తులో స్పష్టమైంది.
తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, పోక్సో చట్టం కింద ఇద్దరిపైనా చర్యలు ప్రారంభించారు. ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తూ వైస్ ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ రజిని రాగమాలను వెంటనే సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: