నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో(Temple Donations) హుండీలు నిండిపోయాయి. తిరుమల, షిర్డీ, విజయవాడ కనకదుర్గమ్మ, కాణిపాకం వంటి ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు రికార్డు స్థాయిలో విరాళాలు సమర్పించారు. కొత్త ఏడాది ఆరంభంలో ఇష్టదైవాల ఆశీస్సులు కోరుతూ భక్తులు భారీగా కానుకలు అర్పించడంతో ఆలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది.
Read also: Telangana: మేడారం జాతరకు వచ్చే భక్తులకు టోల్ మినహాయింపు?

షిర్డీ సాయినాథుడికి రూ.23 కోట్లకు పైగా ఆదాయం
మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథ ఆలయంలో(Temple Donations) డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.23 కోట్ల 29 లక్షలకుపైగా హుండీ ఆదాయం లభించింది.
- హుండీల ద్వారా భారీ నగదు
- దానం కౌంటర్లు, పీఆర్ టోల్ పాస్‌లు
- డెబిట్, క్రెడిట్, ఆన్‌లైన్ చెల్లింపులు
- 26 దేశాల నుంచి వచ్చిన విదేశీ కరెన్సీ
ఈ మార్గాల ద్వారా మొత్తం ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాదు భక్తులు 294 గ్రాముల బంగారం, దాదాపు 6 కిలోల వెండిని కూడా కానుకగా సమర్పించారు.
కనకదుర్గమ్మ ఆలయంలో సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం ఈసారి హుండీ ఆదాయంలో కొత్త చరిత్ర సృష్టించింది. గత 16 రోజుల్లో రూ.3 కోట్ల 6 లక్షలకుపైగా ఆదాయం లభించింది. భవానీ దీక్షల విరమణ, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడంతో ఈ ఆదాయం సాధ్యమైందని అధికారులు తెలిపారు.
భక్తులు నగదితో పాటు బంగారం, వెండి రూపంలో కూడా మొక్కులు చెల్లించారు.
విదేశీ కరెన్సీతో నిండిన అమ్మవారి హుండీ
ఈసారి కనకదుర్గమ్మ ఆలయ హుండీలో అమెరికా డాలర్లు, యూరోలు, సింగపూర్ డాలర్లు వంటి విదేశీ నోట్లు పెద్ద సంఖ్యలో లభించడం విశేషంగా మారింది. ఇది అమ్మవారిపై విదేశాల్లోనూ ఉన్న భక్తుల విశ్వాసాన్ని చాటుతోంది. ఇక తిరుమల శ్రీవారికి కూడా భారీ కానుక అందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ రూ.3 కోట్ల విరాళాన్ని టీటీడీ ఈవోకు అందజేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: