తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంలో ఉద్యోగ సంఘాల డైరీని ఆవిష్కరించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం(DA) ఫైలుపై సంతకం చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెలా రూ. 227 కోట్ల అదనపు భారం పడనుందని ఆయన పేర్కొన్నారు.
Read also: TG: ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం

డీఏ 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ
అయినప్పటికీ.. ఉద్యోగుల మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతోనే ఈ అడుగు వేసినట్లు చెప్పారు.గ త ప్రభుత్వ హయాంలో జీతాల కోసం నెలంతా వేచి చూడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.డీఏ 30.03 శాతం నుంచి 33.67 శాతానికి పెంచుతూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు..
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: