Rains In Telugu States: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ (NZB), మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం దంచికొట్టగా, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, విజయనగరం, ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. ఆకస్మికంగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి, ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసారు.
Read Also: Telangana Assembly Row: తెలంగాణ శాసనసభలో కంటతడి పెట్టుకున్న స్పీకర్, సీతక్క

Rains In Telugu States: రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరిక ప్రకారం రానున్న రెండు గంటల్లో తెలంగాణలోని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్రమైన వానలు కురిసే అవకాశముంది. సంగారెడ్డి (SRD), రంగారెడ్డి, వికారాబాద్ (VKB), నల్గొండ జిల్లాల్లో రానున్న 2 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. జనగామ, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ (MBNR), నారాయణపేట, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభావితమయ్యే ప్రాంతాలు పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని గురజాల, మాచర్ల, దర్శి, కందుకూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, వాటి పరిసర ప్రాంతాల్లో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
వర్షంతో పాటు ఈ సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకస్మిక ఈదురుగాలులు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, వాహనదారులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వర్షం, పిడుగులు పడే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు, రేకుల షెడ్లు, విద్యుత్ స్తంభాలు మరియు టవర్ల కింద నిలబడకూడదు.
- పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి.
- బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వాహనదారులు, ప్రయాణికులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అధికారులు కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: