కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి,(Shivraj Singh) మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా, ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జెడ్ ప్లస్ భద్రత కింద, 55 మంది శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది, 10 మంది ఎన్ఎస్‌జీ కమాండోలతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ యొక్క భద్రతను పటిష్టం చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సమాచారం ఆధారంగా మధ్యప్రదేశ్ డీజీపీకి లేఖ పంపి, శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఐఎస్ఐ దృష్టి పెట్టి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ హెచ్చరికలు అందుకున్న తర్వాత భద్రతా సిబ్బంది భోపాల్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి, మరింత బలపరచడం జరిగింది.
Read also :వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

భద్రతా చర్యలు, వ్యక్తిగత కార్యకలాపాలు
ఇంతటి(Shivraj Singh) హెచ్చరికల మధ్య కూడా, శివరాజ్ సింగ్ చౌహాన్ తన రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. శనివారం, భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్న శివరాజ్, “ప్రతి రోజు మొక్కలు నాటాలని సంకల్పం తీసుకున్నాను. పచ్చదనం పెంచేందుకు అందరూ కలిసి రావాలి” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :