Shinsegae data leak : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ రిటైల్ సంస్థ **Shinsegae Group**లోని ఐటీ విభాగం Shinsegae I&C లో భారీ డేటా లీక్ ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 80,000 మంది ఉద్యోగులు మరియు సబ్‌కాంట్రాక్టర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లినట్లు సంస్థ అధికారికంగా ధృవీకరించింది. అయితే కస్టమర్ల వ్యక్తిగత డేటా మాత్రం ఎలాంటి ప్రభావానికి గురికాలేదని కంపెనీ స్పష్టం చేసింది.
ఈ డేటా లీక్ సంస్థ అంతర్గత ఇన్‌ట్రానెట్ సిస్టమ్ ద్వారా జరిగినట్లు వెల్లడించింది. లీకైన సమాచారంలో ఉద్యోగుల కార్పొరేట్ ఐడీ నంబర్లు, పేర్లు, విభాగాల వివరాలు, ఐపీ అడ్రసులు ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనను తొలిసారిగా బుధవారం గుర్తించిన సంస్థ, శుక్రవారం మధ్యాహ్నం Korea Internet & Security Agency కి సమాచారం ఇచ్చింది.
డేటా లీక్ వెలుగులోకి వచ్చిన వెంటనే అత్యవసర తనిఖీలు (Shinsegae data leak) చేపట్టి, భద్రతా చర్యలను అమలు చేసినట్లు షిన్సేగే ఐఅండ్‌సీ తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మాల్వేర్ దాడి వల్లే ఈ లీక్ జరిగినట్లు అనుమానిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన కారణంపై ఇంకా విచారణ కొనసాగుతోందని సంస్థ అధికారులు తెలిపారు.
Read Also: SIR: ఉత్తర్ ప్రదేశ్ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?
షిన్సేగే గ్రూప్ దక్షిణ కొరియాలో డిపార్ట్‌మెంట్ స్టోర్లు, డ్యూటీ ఫ్రీ షాపులు, డిస్కౌంట్ స్టోర్ చైన్ E-Mart, అలాగే Starbucks కాఫీ ఫ్రాంచైజీని నిర్వహిస్తోంది.
ఇదిలా ఉండగా, మరో ఈ-కామర్స్ దిగ్గజం Coupang కూడా ఇటీవల డేటా లీక్ కేసులో కీలక అప్‌డేట్ ఇచ్చింది. సుమారు 3,000 మంది కస్టమర్లకు సంబంధించిన లీకైన సమాచారాన్ని పూర్తిగా రికవర్ చేశామని, ఆ డేటా ఎవరికి కూడా బదిలీ కాలేదని తెలిపింది.
ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా ఈ డేటా లీక్‌కు బాధ్యుడైన మాజీ ఉద్యోగిని గుర్తించామని కూపాంగ్ వెల్లడించింది. ఆ వ్యక్తి సంస్థ భద్రతా కీలు దొంగిలించి, దాదాపు 3.3 కోట్ల ఖాతాల్లోని ప్రాథమిక సమాచారాన్ని యాక్సెస్ చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపింది. అయితే వాస్తవంగా కేవలం 3,000 ఖాతాల సమాచారం మాత్రమే సేవ్ చేసి, తర్వాత తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది.
గత నెలలో కూపాంగ్ డేటా లీక్ కేసును విచారించేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రైవేట్–పబ్లిక్ సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: