हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Telugu news: Seethakka: ప్రశాంతంగా ముగిసిన పంచాయతి ఎన్నికలు.. మంత్రి ప్రశంసలు

Tejaswini Y
Telugu news: Seethakka: ప్రశాంతంగా ముగిసిన పంచాయతి ఎన్నికలు.. మంత్రి ప్రశంసలు

Telangana Panchayat Elections: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా, విజయవంతంగా పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క(Seethakka) అభినందనలు తెలిపారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ కీలక ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.

Read also: High Court: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అభ్యంతరాల గడువు పొడిగింపు

నూతన సర్పంచులు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలి

ఎన్నికల నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, పారదర్శకత, నిబద్ధతతో పనిచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదే విధంగా, ఎన్నికల అథారిటీగా కీలక బాధ్యతలు నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జి.సృజనకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు సహాయ సహకారాలు అందించిన పోలీస్, ఇతర శాఖల అధికారులకు, సిబ్బందికి మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

Seethakka
Seethakka: Panchayat elections concluded peacefully..

పల్లెల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి

ముఖ్యంగా ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా, రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు పూర్తి కావడం అందరి సమిష్టి కృషికి నిదర్శనమని ఆమె అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. నిన్నటి వరకు రాజకీయ పోటీలు ఉన్నా, నేటి నుంచి గ్రామాల సమగ్ర అభివృద్ధి(Panchayat Raj Rural Development) కోసం పార్టీల కతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను విశ్వాసంతో స్వీకరించి, పారదర్శక పాలనతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. పల్లెలే తెలంగాణ సౌభాగ్యం. పల్లెల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి పరిపూర్ణమవుతుందన్నారు.

తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, మోలిక వసతులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాసేవకు అంకితం కావాలని ఆమె కోరారు. గ్రామాల ప్రగతే లక్ష్యంగా, ప్రజల భాగస్వామ్యంతో బలమైన గ్రామపంచాయతీలను నిర్మిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించినందుకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ జి. సృజనకు మంత్రి సీతక్క ఫోన్ చేసి అభినందించారు.

జిల్లా స్థాయి పంచాయతీ అధికారులు, సిబ్బందిని సమరంగా సమన్వయం చేస్తూ, ఎక్కడా ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా, విమర్శలు, ఆరోపణలకు తావులేకుండా ఎన్నికల ప్రతి దశను క్రమ బద్ధంగా నిర్వహించి గ్రామపంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసినందుకు మంత్రి సీతక్క ప్రత్యేకంగా ప్రశంసించారు. కొత్తగా ఏర్పడిన పాలకమండళ్ల అనంతరం కూడా ఇదే పనితీరును కొనసాగిస్తూ గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870