స్టార్ ఆల్ రౌండర్, ఆండ్రీ రస్సెల్ (Andre Russell) ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై మొదటిసారి స్పందించిన రస్సెల్ శారీరకంగా, మానసికంగా ఎదురయ్యే ఛాలెంజెస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. కేవలం బ్యాటర్‌గానో, బౌలర్‌గానో ఆడాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని రస్సెల్ అన్నాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌గా సిక్స్‌లు మాత్రమే కొట్టే ప్లేయర్‌గానూ ఆడటం నచ్చదని చెప్పాడు.
Read Also: Sports: అత్యధికంగా ఇంటర్నెట్లో వెతికిన స్పోర్ట్స్ స్టార్లు వీరే?

“మ్యాచ్‌లు ఎక్కువ. ట్రావెల్ ఎక్కువ. రికవరీ, ప్రాక్టీస్, జిమ్.. ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. రోజూ అదే స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం మీరు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ చేయాలి. కేవలం బ్యాటర్‌గా ఆడటం నాకు సరిపోదు. కనీసం రెండు ఓవర్లు బౌల్ చేస్తేనే నా బ్యాటింగ్ కూడా సెట్ అవుతుంది” అని రస్సెల్ (Andre Russell) క్రిక్‌బజ్‌కి చెప్పాడు.
14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ ముగింపు..
రస్సెల్ 2012 లో ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ ) తో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2014లో కేకేఆర్‌లో చేరాడు. రస్సెల్, ఐపీఎల్ కెరీర్లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడిన అతను అనూహ్యంగా రాణించాడు. కేకేఆర్ తరఫున 12 సీజన్లు ఆడిన రస్సెల్ 2014, 2024 టైటిళ్లలో కీలక పాత్ర పోషించాడు.
ఆండ్రీ రస్సెల్ ఏ సంవత్సరంలో ఐపీఎల్లో చేరాడు?
ఆండ్రీ రస్సెల్ 2012లో ఐపీఎల్లో తన తొలి మ్యాచ్ ఆడాడు. ఆ సమయంలో ఆయన ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఆడాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: