రైల్వే(RRB) నియామక బోర్డు నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 22,000 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలు పదో తరగతి పూర్తి అర్హత కలిగినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాన్ని అందిస్తున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Read also: Bank jobs: SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు

RRB: అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 36 సంవత్సరాలు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించి వయస్సులో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, దివ్యాంగులు, ఈబీసీ, మహిళా అభ్యర్థులు మాత్రం రూ.250 ఫీజు చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 2026 జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం రైల్వే అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని బోర్డు సూచించింది.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లో ఉత్తీర్ణత సాధించాలి. CBTలో అర్హత పొందిన అభ్యర్థులు తరువాత ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లోనూ అర్హత సాధించాలి. చివరిగా, మెడికల్ పరీక్ష పూర్తి అయిన తర్వాత తుది జాబితా విడుదల చేయబడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: