Telangana Rising Vision Document: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పూర్తిస్థాయి పారదర్శకతతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth) స్పష్టం చేశారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పన చివరి దశలో ఉందని, దీన్ని మూడు భాషల్లో – తెలుగు, హిందీ, ఆంగ్లంలో – సిద్ధం చేసి గ్లోబల్ సమిట్‌కి విచ్చేసే ప్రతినిధులకు అందజేస్తామన్నారు. అదేవిధంగా, ప్రజలు సులభంగా చూడగలిగే విధంగా డిజిటల్ రూపంలో కూడా ప్రచురించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
Read Also: TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు

పూర్తి పారదర్శకతతో విజన్ డాక్యుమెంట్ విడుదల
హైదరాబాద్ ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌లో సమిట్ ఏర్పాట్లు, విజన్ డాక్యుమెంట్‌పై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్(Revanth) రెడ్డి కీలక సూచనలు చేశారు. ఈ సమిట్ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశను నిర్దేశించే ఆర్థిక సదస్సుగా నిలవాలని, తదుపరి రెండు దశాబ్దాల ఆర్థిక ప్రణాళిక, పురోగతి దిశ, తెలంగాణ(Telangana) పోటీ శక్తి వంటి అంశాలు విజన్ డాక్యుమెంట్‌లో ప్రతిబింబించాలని అధికారులను ఆదేశించారు.
విమాన రాకపోకలకు ఆటంకాలు లేకుండా సమన్వయం చేయండి
దేశ విదేశాల నుంచి సమిట్‌కు విచ్చేసే అతిథులకు అత్యుత్తమ అనుభవం కల్పించేలా ఏర్పాట్లు పక్కా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే, విమాన రాకపోకల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సమన్వయం సాధించాలని అధికారులకు సూచించారు.
సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలోని అధికారుల బృందం ప్రస్తుతం విజన్ డాక్యుమెంట్(Vision document)కు తుది రూపు ఇస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్యుమెంట్‌ను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో ఉంచి, అందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా చేయనున్నారు. అదనంగా, దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో గ్లోబల్ సమిట్ విజయాలను ప్రదర్శించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: