వరుస ప్లాప్స్తో ఇబ్బందిపడుతున్న మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. కిశోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూశాక ఫ్యాన్స్ మూవీ హిట్ అంటున్నారు. ఇక రవితేజ కెరీర్లో ఇది 76వ చిత్రం కావడం విశేషం.
Read Also: TG High Court: సంక్రాంతి సినిమాల నిర్మాతలకు హైకోర్టులో ఊరట
ఇందులో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ తన మార్క్ కామెడీతో అలరించారు. గత కొంతకాలంగా మాస్ సినిమాలు చేసిన (Ravi Teja) రవితేజ.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోడానికి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సునీల్, సత్య, వెన్నెల కిశోర్, సుధాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా, ఏ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: