Pakistan: పాక్ ప్రభుత్వానికి మరో షాక్! సింధ్ ప్రావిన్స్‌లోని స్థానికులు స్వతంత్ర సిందూదేశ్ కావాలంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు ఆదివారం కరాచీలో హింసాత్మక స్థాయికి చేరి, 25 మంది నిరసనాకారులు అరెస్ట్ అయ్యారు, ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. జియే సింధ్ ముత్తాహిదా మహాజ్ (JSSM) సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనలు నిర్వహించబడ్డాయి. స్థానికులు “Pakistan Murdabad” అంటూ నినాదాలు చేస్తూ, సింధూ ప్రాంతానికి ప్రత్యేక స్వతంత్ర దేశం కావాలని డిమాండ్ చేశారు.
Read also: Diwali: దీపావళి పండుగకు అరుదైన గౌరవం
Pakistan: సింధూదేశ్ ఉద్యమం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. 1947లో దేశ విభజన తర్వాత సింధ్ ప్రాంతం పాకిస్థాన్‌లోకి చేరినప్పటి నుండి స్థానికులు ప్రత్యేక హక్కులు కోరుతూ వస్తున్నారు. 1967లో మొదటిసారిగా స్వాతంత్ర డిమాండ్ బయటకు వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఈ ఉద్యమం కొనసాగింది. స్థానికులు సాంస్కృతిక, చారిత్రక కారణాలతో స్వాతంత్ర
సింధూదేశ్ కావాలని కోరుతున్నారు, మరియు JSSM వంటి సంస్థలు దీన్ని ప్రోత్సహిస్తున్నాయి.