పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో పెళ్లి వేడుక తీవ్ర విషాదంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున వివాహం జరుగుతున్న ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో వధువు, వరుడు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Read also: Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

వేడుక కొనసాగుతున్న సమయంలో గ్యాస్ లీకేజీ ఏర్పడి సిలిండర్ ఒక్కసారిగా పేలినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా కూలిపోగా, సమీపంలోని నాలుగు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
రెస్క్యూ అధికారులు శిథిలాల నుంచి 19 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక ఇలాంటి దుర్ఘటనగా మారడం స్థానికులను తీవ్రంగా కలచివేసిందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: