ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో (Indigo) తలెత్తిన సాంకేతిక సమస్యలు మరియు గందరగోళం కారణంగా దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గందరగోళంలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ (Naresh) కూడా చిక్కుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Read Also: Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై సుప్రీం దృష్టి– అత్యవసర పిల్ దాఖలు

బుధవారం ఉదయం 8:15 గంటలకు తాను హైదరాబాద్‌లోని (Hyderabad) ఇండిగో టెర్మినల్‌కు చేరుకున్నానని, కానీ అప్పటికే అన్ని విమానాలు ఆలస్యమయ్యాయని నరేశ్ తెలిపారు. మూసి ఉన్న బోర్డింగ్ గేట్ల వద్ద గందరగోళంలో ఉన్న ప్రయాణికుల వీడియోను ఆయన పోస్ట్ చేశారు. “విమాన ప్రయాణాల్లోని సరదా 90వ దశకంతోనే ముగిసిపోయింది. గ్రౌండ్ సిబ్బందికి, ప్రయాణికులకు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. అంతా గజిబిజిగా ఉంది” అని తన పోస్టులో పేర్కొన్నారు.
నటులకు ప్రైవసీ కరువు: నరేశ్ ఆవేదన
ప్రస్తుత విమాన ప్రయాణాల కన్నా 1990ల నాటి ప్రయాణాలే సురక్షితంగా, మెరుగ్గా ఉండేవని నరేశ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో నటులకు ప్రైవసీ (గోప్యత) కూడా లేకుండా పోయిందని ఆయన వాపోయారు. “మాస్కులు, సన్‌గ్లాసెస్ పెట్టుకున్నా కూడా స్కానర్లు నటులను గుర్తించేస్తున్నాయి. టైమ్ మెషీన్ ఉంటే బాగుండును, 90ల నాటి రోజులకు వెళ్లిపోయేవాడిని” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: