వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్
విజయవాడ : తన జీవితాన్ని(Nara Lokesh) వేశానికే అంకితం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి(Atal Bihari Vajpayee) అని, ఆయన పేరు చెబితేనే నమ్మకం, అభివృద్ధి, సువరిపాలన గుర్తుకు వస్తాయని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. భారతరత్న వాజ్ పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా, ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఖిజిటల్ సందేశిమోదీ సుపరిపాలనఖీ బస్సు యాత్రలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో కలిసి ఆవిష్కరించారు.
Read also: APCOB Scams: సహకార బ్యాంకుల అక్రమాలపై ఏపీ స్పీకర్ కీలక నిర్ణయం

నైతిక విలువలు, సుపరిపాలనకు వాజ్పేయి స్ఫూర్తి : నారా లోకేష్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ.. వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. “చాలామంది నన్ను స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబులలో ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారని అడుగుతారు. కానీ ఒక మత్స్యకార గ్రామాన్ని అభివృద్ధి చేసిన సింగపూర్ ప్రధాని లీక్వాన్యూ. భారతదేశాన్ని సమైక్యంగా ముందుకు నడిపిన అటల్ బిహారీ వాజ్పేయి నాకు స్ఫూర్తి’ అని లోకేశ్ స్పష్టం చేశారు. సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో ఆదరణలో చూపిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని, ఆయనకు రాజకీయంగా ప్రతిపక్షమే లేదని అన్నారు. చిన్న వయసులోనే కవిత్వానికి, దేశానికి తన జీవితాన్ని అంకితం చేసి, 18 ఏళ్లకే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన మహనీయుడని గుర్తు చేసుకున్నారు. వాజ్ పేయి మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని, తొలిసారి 13 రోజులకే మెజారెటీ లేకపోవడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశారని, ఆ తర్వాత ఆయనకు తిరుగులేకుండా పోయిందని లోకేశ్ వివరించారు. దేశ భద్రత కోసం పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి, కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ మరాక్రమణను సమర్థంగా తిప్పికొట్టిన ధీశాలి అని ప్రశంసించారు.
స్వర్ణ చతుర్భుజి, సంస్కరణలతో దేశాభివృద్ధికి పునాది వేసిన వాజ్పేయి
ఓ వైపు దేశ భద్రత, మరోవైపు అభివృద్ధికి ఆయన పెద్దపీట వేశారని తెలిపారు. (Nara Lokesh)స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశంలో రహదారుల వ్యవస్థకు కొత్త రూపునిచ్చారని, చంద్రబాబు కోరిక మేరకు టెలికాం రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని, ఈనాడు మనం చూస్తున్న ఆధునిక విమానాశ్రయాలకు కూడా ఆయన సంస్కరణలే కారణమని అన్నారు. వాజ్పేయికి, చంద్రబాబుకు మధ్య తండ్రీకొడుకుల అనుబంధం ఉండేదని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. “అనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఢిల్లీకి వెళితే, సొంత కొడుకు వచ్చినంతగా వాజ్ పేయి ఆనందపడేవారు. 1998లోనే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడింది. ఈ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి కారణం వాజ్ పేయినే. ఐఎస్బీ, బీమా నియంత్రణ సంస్థను హైదరాబాద్లో ఏర్పాటు చేసి, ఆఫ్రోఏషియన్ గేమ్స్్కు నిధులు కేటాయించారు. అందుకే తెలుగు జాతి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది” అని లోకేశ్ ఉద్ఘాటించారు. వాజ్ పేయి చూపిన మార్గంలోనే ప్రధాని నరేంద్ర మోడీ పయనిస్తున్నారని, అందుకే ఏపీలో ఇప్పుడు డబుల్ ఇంజన్ కాదు, బుల్లెట్ ట్రైన్ వేగంతో ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ఆర్థికంగా ఎదగడమే కాకుండా, నైతిక విలువలు కూడా ముఖ్యమని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నైతిక విలువలపై బోధన ప్రారంభిస్తామని తెలిపారు. తన నియోజకవర్గం మంగళగిరిలో వాజ్ పేయి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీ. ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, బీజేపీ నేత సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: