Nandigram By Election Result: పశ్చిమ బెంగాల్‌లోని కీలకమైన నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ ఏకంగా 1,22,753 ఓట్ల భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు. 1967 నుంచి నందిగ్రామ్ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థుల మెజారిటీలలో ఇదే ఆల్-టైమ్ రికార్డుగా నిలిచింది. ఈ ఫలితంతో పశ్చిమ బెంగాల్ బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది.
Read also:Tamil Nadu By Election Results: మధురాంతకంలో టీవీకే ఘనవిజయం
Nandigram By Election Result: ఓట్ల లెక్కింపు వివరాలు & సువేందు అధికారి రికార్డు తుడిచిపెట్టుకుపోయిన తీరు

- పోలైన ఓట్ల వివరాలు:
- బీజేపీ (హసిరాణి రథ్): 1,64,427 ఓట్లు (విజయం)
- కాంగ్రెస్ (మిలన్ ప్రధాన్): 41,674 ఓట్లు (రెండో స్థానం)
- సీపీఐ (శాంతి గోపాల్ గిరి): 5,779 ఓట్లు (మూడో స్థానం)
- ఆలిండియా సెక్యులర్ ఫ్రంట్ (అలీ మహమ్మద్): 1,607 ఓట్లు
- డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్: 853 ఓట్లు
- పోటీకి దూరంగా టీఎంసీ: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఈ ఎన్నికల్లో అభ్యర్థి సంచిత ప్రధాన్ డే నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పోటీకి దూరంగా ఉంది. చివరి నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థికి టీఎంసీ మద్దతు తెలిపినప్పటికీ, బీజేపీ భారీ ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది.
- పాత రికార్డులు తిరగరాసిన హసిరాణి: 2016లో టీఎంసీ తరఫున సువేందు అధికారి సాధించిన 81,230 ఓట్ల మెజారిటీ రికార్డును హసిరాణి దాటేశారు. మైనారిటీ ఓటర్లు కూడా తమకే మద్దతు పలికారాని సువేందు అధికారి స్పష్టం చేశారు.
- ఉప ఎన్నిక నేపథ్యం: ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్ (9,665 ఓట్ల మెజారిటీ), భవానీపూర్ స్థానాల నుంచి గెలుపొందారు. అయితే భవానీపూర్‌ను నిలబెట్టుకుని నందిగ్రామ్‌ను వదులుకోవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. కాగా గెలిచిన హసిరాణి రథ్.. గత మే 6న హత్యకు గురైన సువేందు అధికారి మాజీ పీఏ చంద్రనాథ్ రథ్ తల్లి కావడం గమనార్హం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also: