Naksha resurvey : నక్ష (రీసర్వే) కార్యక్రమం ద్వారా ప్రజల భూములకు పూర్తి రక్షణ కల్పించవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. నక్ష (రీసర్వే) కార్యక్రమంపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘నక్షా’ అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల సర్వే చేసి, వాటి సరిహద్దులను ఖరారు చేయడం జరుగుతుందని చెప్పారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, (Naksha resurvey) తమ ఆస్తులకు సంబంధించిన సరిహద్దులు, వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే నక్షా రీసర్వే ద్వారా శాశ్వతంగా పరిష్కారం పొందవచ్చని సూచించారు. సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు సంబంధిత ఆస్తి పత్రాల నకళ్లు అందజేసి సహకరించాలని తెలిపారు.

Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
ఈ రీసర్వే ప్రక్రియ ద్వారా ఖచ్చితమైన ఆస్తి రికార్డులు రూపొందించి, ప్రజలకు హక్కు పత్రాలు కూడా జారీ చేయడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యక్రమం కావడంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ శారదా దేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఏసీపీలు మూర్తి, పార్వతి ప్రియ, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్లానింగ్ సెక్రటరీలు, అడ్మిన్ సెక్రటరీలు, వీఆర్ఓలు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: