Mojtaba Khamenei news : ఇరాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మరణానంతరం, ఆయన రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యారన్న వార్తలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. దీనిపై అధికారిక ధృవీకరణ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మొజ్తాబా ఖమేనీ ఇరాన్ మత, రాజకీయ వర్గాల్లో ప్రభావశీలుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా Islamic Revolutionary Guard Corps (IRGC)తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో తండ్రి కార్యకలాపాల్లో తెరవెనుక కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం ఉంది.
Read Also: Madhya Pradesh: విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
మొజ్తాబా ఖమేనీ ఎవరు?
1959లో మషాద్‌లో జన్మించిన మొజ్తాబా, కోమ్ (Mojtaba Khamenei news) నగరంలో ఉన్నత ఇస్లామిక్ విద్యను అభ్యసించారు. అధికారికంగా ప్రభుత్వ పదవి లేకపోయినా, ఇరాన్ రాజకీయాల్లో ప్రభావం చూపిన నేతగా ఆయన పేరు వినిపిస్తుంది. 2005, 2009 అధ్యక్ష ఎన్నికల సమయంలో మహ్మూద్ అహ్మదీనెజాద్ విజయంలో కూడా ఆయన పాత్ర ఉన్నట్లు అప్పట్లో చర్చలు జరిగాయి.
తండ్రి మరణం తర్వాత సుప్రీం లీడర్ హోదాకు మొజ్తాబానే వారసుడని భావిస్తూ IRGC మద్దతు ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: